AP Politics: ఈనెల 24న టీడీపీ, జనసేన తొలి జాబితా.. ప్లాన్ ఇదేనా..?
ABN, Publish Date - Feb 23 , 2024 | 08:58 PM
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం - జనసేన (TDP-Jana Sena) కూటమి పలు కసరత్తులు చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు పావులు కదుపుతున్నాయి. అధికార వైసీపీ(YSRCP)ను ఢీకొట్టేందుకు టీడీపీ - జనసేన కూటమి పలు ప్రణాళికలను రచిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu), జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉమ్మడిగా తొలి జాబితాను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం - జనసేన (TDP-Jana Sena) కూటమి పలు కసరత్తులు చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు పావులు కదుపుతున్నాయి. అధికార వైసీపీ(YSRCP)ను ఢీకొట్టేందుకు టీడీపీ - జనసేన కూటమి పలు ప్రణాళికలను రచిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu), జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉమ్మడిగా తొలి జాబితాను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ - జనసేన పొత్తులపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చారు. తొలి జాబితాలో టీడీపీ నుంచి ఒక 50 పేర్లను.. జనసేన నుంచి 15 పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.
ఆ కీలక నేతలకు చంద్రబాబు పిలుపు
రేపు(శనివారం) ఉదయం తెలుగుదేశం కార్యాలయానికి రావాలని పార్టీ సీనియర్ నేతలకు చంద్రబాబు సూచించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ నేతలను ఉదయం తన నివాసానికి రావాలని చంద్రబాబు అన్నారు. వారితో చంద్రబాబు తొలుత మంతనాలు జరపనున్నారు. ఆ తర్వాత జాబితా ప్రకటించే అవకాశం ఉంది. వైసీపీ అభ్యర్థుల జాబితాల ప్రకటనలతో టీడీపీ, జనసేన నేతలపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే బీజేపీ పొత్తుపై ఇంకా క్లారిటీ రాలేదు. ఢిల్లీ నుంచి పిలుపు వస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ లోపు కొంతమంది అభ్యర్థులను ప్రకటించాలని ఇరుపక్షాలు భావిస్తున్నాయి. రేపు(శనివారం) ఉదయానికి తొలి జాబితాపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Updated Date - Feb 23 , 2024 | 10:30 PM