ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YSRCP Manifesto 2024: మళ్లీ గెలిస్తే.. అమ్మ ఒడి పెంపు: సీఎం జగన్

ABN, Publish Date - Apr 27 , 2024 | 01:20 PM

అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిస్తే ఇప్పుడిస్తున్న అమ్మ ఒడి సాయాన్ని పెంచుతామని సీఎం జగన్(CM Jagan) ప్రకటించారు. తాడేపల్లిలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ మాట్లాడారు. వైసీపీ గెలవగానే జగనన్న అమ్మఒడి కింద ఇస్తు్న్న రూ.15 వేలను రూ.17 వేలకు పెంచుతామని ప్రకటించారు.

తాడేపల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిస్తే ఇప్పుడిస్తున్న అమ్మ ఒడి సాయాన్ని పెంచుతామని సీఎం జగన్(CM Jagan) ప్రకటించారు. తాడేపల్లిలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ మాట్లాడారు. వైసీపీ గెలవగానే జగనన్న అమ్మఒడి కింద ఇస్తు్న్న రూ.15 వేలను రూ.17 వేలకు పెంచుతామని ప్రకటించారు.

ఈ సాయం తల్లులకు ఎంతగానో ఉపయోగపడుతుందని.. పిల్లల చదువులు భారం కాకూడదనే సాయం పెంపు నిర్ణయం తీసుకున్నామన్నారు.


మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథమన్న జగన్.. ఇచ్చిన హామీలన్నీ తూ.చా. తప్పకుండా అమలు చేశామన్నారు. మా పాలనకు మేనిఫెస్టో అద్దంపట్టిందని.. నవరత్నాల కింద ఇప్పటివరకు రూ.2 లక్షల 70వేల కోట్లను డీబీటీల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు.

2019లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని.. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 59 నెలల కాలంలోనే హామీలన్ని నెరవేర్చి చూపామన్నారు. 2024 ఎన్నికలకు సంబంధించి రెండు పేజీలతో వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉన్న సంక్షేమ పథకాలకే నిధుల పెంపుపై జగన్ ప్రధానంగా దృష్టి సారించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Andhra Pradesh and Telugu News Here

Updated Date - Apr 27 , 2024 | 01:20 PM

Advertising
Advertising