Education Dept : టెన్త్ పరీక్ష ఫీజుకు తత్కాల్ విధానం
ABN, Publish Date - Dec 25 , 2024 | 04:15 AM
పదో తరగతి పరీక్షల ఫీజుల చెల్లింపులకు ప్రభుత్వ పరీక్షల విభాగం మరో అవకాశం ఇచ్చింది.
అమరావతి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల ఫీజుల చెల్లింపులకు ప్రభుత్వ పరీక్షల విభాగం మరో అవకాశం ఇచ్చింది. తత్కాల్ విధానం పేరుతో ఈ నెల 27 నుంచి జనవరి 10 వరకు ఫీజులు చెల్లించవచ్చని తెలిపింది. తత్కాల్‌లో రూ.వెయ్యి ఫైన్ చెల్లించాలని స్పష్టం చేసింది. గతంలో ఫీజులు చెల్లించనివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కె.శ్రీనివాసులురెడ్డి సూచించారు.
Updated Date - Dec 25 , 2024 | 04:16 AM