chariot : ఢిల్లీలో గణతంత్ర పరేడ్‌కు ఏటికొప్పాక శకటం
ABN, Publish Date - Dec 24 , 2024 | 04:34 AM
దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ శకటం నమూనాను అనకాపల్లి జిల్లా..
ABN AndhraJyothy : దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ శకటం నమూనాను అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాకకు చెందిన హస్త కళాకారులు రూపొందించారు. ఐఅండ్‌పీఆర్ అధికారుల సూచనలతో నమూనా శకటం తయారుచేసినట్టు కళాకారుడు గొర్సా సంతోష్ సోమవారం తెలిపారు. తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ శకటానికి రూపకల్పన చేసినట్టు చెప్పారు.
- ఎలమంచిలి, ఆంధ్రజ్యోతి
Updated Date - Dec 24 , 2024 | 04:35 AM