ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Paritala Sriram: వైసీపీ నాపై దుష్ప్రచారం చేస్తోంది

ABN, Publish Date - Jan 08 , 2024 | 07:22 PM

కొందరు వైసీపీ నేతలు ( YCP Leaders ) తనకు ఓటు వేయకపోతే చంపేస్తామని దుష్ప్రచారం చేస్తున్నారని ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ ( Paritala Sriram ) అన్నారు.తను చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభ నిర్వహించారు.

శ్రీ సత్యసాయి జిల్లా: కొందరు వైసీపీ నేతలు ( YCP Leaders ) తనకు ఓటు వేయకపోతే చంపేస్తామని దుష్ప్రచారం చేస్తున్నారని ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ ( Paritala Sriram ) అన్నారు.తను చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ...తనను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే ధర్మవరంలో అరాచకానికి అడ్డుకట్ట వేసి ప్రశాంత వాతావరణంలో ప్రజలు వ్యాపారాలు చేసుకునే విధంగా చేస్తానని తెలిపారు. ధర్మవరంలో ఏ కాలనీలో చూసినా సమస్యలు పలకరిస్తున్నాయన్నారు. గుడ్ మార్నింగ్ పేరుతో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ( MLA Kethi Reddy Venkatarami Reddy )చేసింది ఏమీ లేదన్నారు. ధర్మవరంలో హ్యాండ్ లూమ్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. కాపాడుకోకపోతే మనుగుడే ఉండదని పరిటాల శ్రీరామ్ చెప్పారు.

చేనేత కార్మికులను ఆదుకుంటా

ధర్మవరానికి గుండెలాంటి చేనేత కార్మికుని ఆదుకునే విధంగా తన తొలి అడుగు ఉంటుందని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా పట్టు చీరల తయారీని చేపట్టి కార్మికులకు లాభసాటిగా మారుస్తామన్నారు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల పిల్లలను ఆదుకోవడానికి వారి ద్వారానే ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ధర్మవరంలో ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదని హైటెక్ దందాలు ఇక్కడ వచ్చాయని.. ఇలాంటి వాటి పట్ల ధర్మవరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరిటాల శ్రీరామ్ సూచించారు.

Updated Date - Jan 08 , 2024 | 07:22 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising