YCP : ఉద్దరగా కొట్టేద్దామని..!
ABN, Publish Date - Aug 24 , 2024 | 12:46 AM
మండలంలోని కమ్మూరు గ్రామ సమీపంలోని అగ్రిగోల్డ్ భూమిని ఆక్రమించుకోవడానికి ఓ వైసీపీ నాయకుడు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. బ్రహ్మణపల్లి రెవెన్యూ పరిధిలో 221.45 ఎకరాల్లో అగ్రిగోల్డ్ సంస్థ వెంచర్ ఉంచి. ఈ భూమి మొత్తం కోర్టు పరిధిలో ఉంది. దీన్ని కబ్జా చేసేందుకు వైసీపీ పాలనలోనే ఆ పార్టీ నాయకులు కొందరు ప్రయత్నించారు. అనంతపురం- బళ్లారి ప్రధాన ...
అగ్రిగోల్డ్ భూమి ఆక్రమణకు వైసీపీ నాయకుడి యత్నం
ప్రధాన రహదారి పక్కనే కంపచెట్లు తొలగింపు
వెంచర్‌లోని విలువైన సామగ్రి తరలింపు
కూడేరు: మండలంలోని కమ్మూరు గ్రామ సమీపంలోని అగ్రిగోల్డ్ భూమిని ఆక్రమించుకోవడానికి ఓ వైసీపీ నాయకుడు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. బ్రహ్మణపల్లి రెవెన్యూ పరిధిలో 221.45 ఎకరాల్లో అగ్రిగోల్డ్ సంస్థ వెంచర్ ఉంచి. ఈ భూమి మొత్తం కోర్టు పరిధిలో ఉంది. దీన్ని కబ్జా చేసేందుకు వైసీపీ పాలనలోనే ఆ పార్టీ నాయకులు కొందరు ప్రయత్నించారు. అనంతపురం- బళ్లారి ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న వెంచర్‌లో కల్యాణ మండలం షెడ్డుతోపాటు వంటశాల షెడ్డుకున్న సామగ్రిని మాయం చేశారు. జిల్లా కేంద్రంలో ఉన్న వైసీపీ నాయకుడిని అగ్రిగోల్డ్ భూములపై కన్నుపడటంతో రెండు నెలల కిందట వెంచర్ చుట్టూ, లోపల, బయట కంపచెట్లు తొలగించాడు. ఇంతటితో ఆగకుండా ప్రహరీని ధ్వంసం చేశారు. కోర్టు పరిధిలోనున్న భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నా రెవెన్యూ
అధికారులు మాత్రం మౌనంగా ఉన్నారు.
విలువైన భూమిపైనే కన్ను....
అనంతపురం- బళ్లారి ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న భూమి ఎకరం రూ.రెండుకోట్ల వరకు ధర పలుకుతోంది. ఇంత విలువైన భూమిపై వైసీపీ నాయకుడికి కన్ను పడటంతో దాదాపు రెండు ఎకరాల వరకు కంపచెట్లు తొలగించారు. వైసీపీ పాలనలో కొందరు రియల్టర్లు కోట్లు విలువైన అసైన్డ భూములను తక్కువ ధరలకే కొట్టేశారు. వాటిని రిజిస్ర్టేషన చేసి, వెంచర్లు వేసి అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అగ్రిగోల్డ్ భూములను స్వాధీనం చేసుకోవడానికి కంపచెట్లు తొలగించి కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చే విధంగా ఎత్తుగడ వేసినట్లు సమాచారం. ఈ విషయంపై డిప్యూటీ తహసీల్దారు విశ్వనాథ్‌ను అడగ్గా కోర్టు పరిధిలోని అగ్రిగోల్డ్ భూములను శుభ్రం చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని, సంబంధిత వ్యక్తులను రికార్డులుంటే తీసుకురావాలని చెప్పామని, ఇంత వరకు వారు రాలేదన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Aug 24 , 2024 | 12:46 AM