ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Revanth Reddy: రేవంత్‌రెడ్డి పాదయాత్రపై మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-02-04T18:17:53+05:30

కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెండ్డి (Revanth Reddy) పాదయాత్రపై ఏఐసీసీ (AICC) కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి కుమార్‌ (Maheswar Reddy Kumar) అభ్యంతరం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెండ్డి (Revanth Reddy) పాదయాత్రపై ఏఐసీసీ (AICC) కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి కుమార్‌ (Maheswar Reddy Kumar) అభ్యంతరం తెలిపారు. రాహుల్‌ (Rahul Gandi) చెప్పిన హాత్ సే హాత్ జొడో కాన్సెప్ట్ వేరు రేవంత్‌రెడ్డి చేస్తున్న పాదయాత్ర వేరని మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే మహేశ్వర్‌రెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్‌ (Congress) ఇన్‌చార్జ్‌ థాక్రే సర్ది చెప్పారు. ఆసక్తి ఉన్న నియోజకవర్గాల్లో తీరగాలని మహేశ్వర్‌రెడ్డికి థాక్రే సూచించారు. నేతలు జనంలోకి వెళ్లడం ముఖ్యమని కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ థాక్రే పేర్కొన్నారు.

కాగా మహేశ్వర్‌ రెడ్డి కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు అధిష్టానం అనుమతి ఇవ్వలేదని ఆయన తెలిపారు. హత్ సే హత్ జోడోలో బ్లాకుల వారీగా పాదయాత్ర నిర్వహిస్తామని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అభియాన్ ముగింపులో భాగంగా హైదరాబాద్‌లో జరిగే సభకు రాహుల్ గాంధీ వస్తారని ఆయన తెలిపారు. ఏఐసీసీ ఇచ్చిన సర్క్యూలర్‌లో 2 నెలల పాదయాత్ర అని వుందని కానీ.. జనవరి 26 నుంచి 5 నెలల పాటు పాదయాత్ర అన్నారని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదని ఏఐసీసీ వెల్లడించిందన్నారు.

పాదయాత్రపై అప్పట్లో రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే..?

సీతక్క ప్రాతినిథ్యం వహిస్తున్న ములుగు నుంచి ఈ పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. పాదయాత్ర మొదట మొదటి విడతలో 60 రోజులు ఉంటుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందులో దాదాపు 50 నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుందని చెప్పారు. మొదట విడత పాదయాత్ర పూర్తయిన తరువాత రెండో విడత పాదయాత్రపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. పాదయాత్రలో భాగంగా వివిధ సందర్భాల్లో పార్టీకి చెందిన జాతీయ నాయకులు హాజరవుతారని రేవంత్ రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-02-04T18:18:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising