ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MLA Sudhir Reddy: పార్టీ మార్పుపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఏమన్నారంటే..?

ABN, First Publish Date - 2023-12-12T15:51:36+05:30

పార్టీ మార్పుపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ( MLA Devi Reddy Sudhir Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొన్నిరోజులుగా ఎమ్మెల్యే దేవిరెడ్డి పార్టీమారుతారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని సుధీర్‌రెడ్డి అన్నారు.

హైదరాబాద్: పార్టీ మార్పుపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ( MLA Devi Reddy Sudhir Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొన్నిరోజులుగా ఎమ్మెల్యే దేవిరెడ్డి పార్టీ మారుతారని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ఆయన ఏమన్నారంటే.. ‘‘నేను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను ఖండిస్తున్నాను. నేను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ప్రసక్తేలేదు. పార్టీలో నాకు సముచిత స్థానం ఉంది. ఈ వార్తలను సృష్టిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటా. బీఆర్ఎస్ నేతలు తొందరపడి కాంగ్రెస్ పార్టీపై మాట్లాడొద్దు. ఓటమిని హుందాగా స్వీకరిద్దాం. కాంగ్రెస్ పార్టీ హామీల అమలుపై ఒత్తిడి తీసుకొద్ధాం. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి. ఆ తర్వాతే బలమైన ప్రతిపక్షంగా మన గొంతు వినిపిద్దాం’’ అని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2023-12-12T15:53:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising