ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

DCP Srinivas: ఆ ఫైళ్ల మాయంపై విచారణ వేగవంతం చేశాం

ABN, First Publish Date - 2023-12-11T15:50:56+05:30

తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రుల కార్యాలయాల్లో ఫైళ్ల మాయంపై విచారణ వేగవంతం చేశామని సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ ( DCP Srinivas ) తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రుల కార్యాలయాల్లో ఫైళ్ల మాయంపై విచారణ వేగవంతం చేశామని సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ ( DCP Srinivas ) తెలిపారు. సోమవారం నాడు డీసీపీ తన కార్యాలయంలో ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. ఈ కేసులో డైరక్టర్‌ను విచారణ చేయాల్సి ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్లు, ఫర్నిచర్ మిస్సింగ్ పై దర్యాప్తు చేస్తున్నాం. పశు సంవర్థక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మిస్సింగ్ చేసినట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్‌పై ఆరోపణలు ఉన్నాయి. కళ్యాణ్‌తో పాటు డైరెక్టర్‌ను విచారణ చేసి, స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తాం. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కార్యాలయాల్లో ఫర్నిచర్ మిస్సింగ్‌పై కూడా కేసు నమోదు చేశాం. అలాగే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయంలో బిర్వాలు మిస్సింగ్‌పై కూడా కేసు నమోదు చేశాం.విద్యా శాఖలో జరిగిన సంఘటన పై దర్యాప్తు జరుగుతుంది. మాజీ మంత్రుల ప్రమేయం ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. విచారణలో ఎవరి ప్రమేయం ఉన్న చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం’’ అని డీసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు.

Updated Date - 2023-12-11T16:30:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising