ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Heavy rain: హైదరాబాద్‌‌లో భారీ వడగండ్ల వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు!

ABN, First Publish Date - 2023-03-18T18:12:03+05:30

నగర వ్యాప్తంగా శనివారం సాయంత్రం వడగండ్ల వర్షం కురిసింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పటాన్‌చెరు, రామచంద్రపురం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్‌: నగర వ్యాప్తంగా శనివారం సాయంత్రం పెద్ద ఎత్తున వడగండ్ల వాన (Heavy rain) పడింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రధానంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, షేక్‌పేట్, టోలిచౌకి, మోహిదీపట్నం, మణికొండ, నార్సింగి, పటాన్‌చెరు, రామచంద్రపురం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈ భారీ వర్షం ధాటికి జనజీవనం నిలిచిపోయింది. ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడం, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో వాహనదారులు బారులుతీరారు. మరో నాలుగు గంటల పాటు వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో నగరంలోని ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

ఇక తెలంగాణలోని కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో కూడా వడగండ్ల వర్షం కురిసింది. ఈదురుగాలుల తాకిడికి పలు రేకుల షెడ్లు ధ్వంసమయ్యాయి. మరోవైపు చాలా ప్రాంతాల్లో రవాణా స్తంభించింది. బాన్సువాడ (Bansuada) డివిజన్ కేంద్రంలోనూ వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. అకాల వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక (Tamil Nadu to Karnataka) మీదుగా కొంకన్‌ తీరం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Department of Meteorology) అంచనా వేసింది.

Updated Date - 2023-03-18T18:46:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising