Thummala Nageswara Rao: కాంగ్రెస్ నేతలను బెదిరించే పోలీస్ అధికారుల సంగతి చూస్తా
ABN, First Publish Date - 2023-10-29T22:38:39+05:30
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలను బెదిరించే పోలీస్ అధికారుల సంగతి చూస్తామని మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) హెచ్చరించారు.
ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలను బెదిరించే పోలీస్ అధికారుల సంగతి చూస్తామని మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) హెచ్చరించారు. ఆదివారం నాడు 31వ డివిజన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తుమ్మల పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పత్తి మార్కెట్ తరలింపుపై తప్పుడు ప్రచారం చేస్తూన్నారు మార్కెట్ ఇక్కడే ఉంటోంది. పత్తి మార్కెట్, కూరగాయల మార్కెట్‌ను నేను కట్టించాను. ప్రకాష్ నగర్ వద్ద మున్నేరుపై బ్రిడ్జి నిర్మాణంతో త్రీ టౌన్ ఏరియా అభివృద్ధి బాట పట్టింది. పరిధి దాటి వ్యవహరించే కొంత మంది పోలీస్‌లు వైఖరి మార్చుకోవాలి. త్రీ టౌన్ ఏరియాలో గోళ్లపాడు కాలువ కాంట్రాక్టర్‌ను బెదిరించి సొంత కంపెనీతో దోచుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్, మున్సిపల్ కార్పొరేషన్ కొత్త భవనాలను నాసిరకంగా నిర్మించి ప్రజా సొమ్మును దోపిడీ చేశారు. పోలీస్ వేధింపులు లేకుండా ఖమ్మం అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలి’’ అని తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
Updated Date - 2023-10-29T22:38:39+05:30 IST