ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR: కేసీఆర్‌ను ఈ ఎన్నికల్లో ఓడించడానికి ఢిల్లీ గులాములు తెలంగాణకు వస్తున్నారు: కేటీఆర్

ABN, First Publish Date - 2023-11-01T16:25:34+05:30

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ( CM KCR ) కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ( MLA Gampa Govardhan ) పట్టుబడితేనే ఇక్కడ నుంచి బరిలోకి దిగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ( KTR ) అన్నారు.

కామారెడ్డి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ( CM KCR ) కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ( MLA Gampa Govardhan ) పట్టుబడితేనే ఇక్కడ నుంచి బరిలోకి దిగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ( KTR ) అన్నారు. బుధవారం నాడు బిక్కనూర్ మండల కేంద్రంలో రాజంపేట, బిక్కనూర్ మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ...‘కామారెడ్డి నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండాలని కేసీఆర్‌ను ఇక్కడ నుంచి పోటీ చేయడానికి గంప గోవర్ధన్, బీఆర్ఎస్ నేతలు కామారెడ్డి ప్రజలు ఆహ్వానించారు. కొడంగల్‌కు కేసీఆర్ రాకపోతే కామారెడ్డికి తానే వస్తానని రేవంత్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి వచ్చి కేసీఆర్ మీద తొడ కొట్టడం అంటే పోచమ్మ ముందు గొర్రె పొట్టేలును కట్టేసినట్టే అవుతుంది. తెలంగాణ ఉద్యమ నాయకులపైకి తుపాకీ గురిపెట్టిన రైఫీల్‌రెడ్డి కేసీఆర్‌ను ఒడిస్తాడట’’ అని మంత్రి కేటీఆర్ ఎద్దేవ చేశారు.

గుజరాత్ దొంగ పైసలు తీసుకోండి: మంత్రి కేటీఆర్

‘‘కేసీఆర్ మీద ఒడిపోతాననే భయంతో బీజేపీ అభ్యర్థి సిమెంట్, సలాకలు ఇచ్చుడు బంద్ చేసిండు. గుజరాత్ దొంగ పైసలు తీసుకోండి.. ఓటు మాత్రం కారు గుర్తుకు వేయాలి. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఇక్కడినుంచి నిజామాబాద్ పారిపోతున్నాడు. కేసీఆర్ ఇక్కడ పోటీ చేయడానికి వస్తే వెయిరేట్ల అభివృద్ధి జరుగుతుంది. సోనియాగాంధీని బలిదేవత అని, రాహుల్ గాంధీని ఉత్త పప్పు కాదు ముద్దపప్పు అని రేవంత్‌రెడ్డి అనలేదా ఈ విషయం కాంగ్రెస్ క్యాడర్‌కు గుర్తులేదా..? దొరలకు, ప్రజలకు పోటీ అని రాహుల్‌గాంధీ అంటున్నాడు. ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటంలో విజయం సాధించేది తెలంగాణ ప్రజలే. 55 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి పీకింది.. ఇప్పుడు మోచేతికి బెల్లం పెడుతున్నారు. ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకు దమ్ములేక డీకే శివకుమార్, రాహుల్ గాంధీలను రాష్ట్రంలో ప్రచారానికి తెస్తున్నారు. బీజేపీ నేతలు 15 మంది ముఖ్యమంత్రులు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్రమోదీలను తెస్తున్నారు. బక్కపలచని కేసీఆర్‌ను ఎన్నికల్లో ఓడించడానికి ఢిల్లీ గులాములు వస్తున్నారు’’ అని కేటీఆర్ సెటైర్లు వేశారు.

Updated Date - 2023-11-01T16:25:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising