Kishan Reddy: ప్రవళిక ఆత్మహత్య పాపం కేసీఆర్ ప్రభుత్వానిదే
ABN, First Publish Date - 2023-10-30T20:35:04+05:30
ప్రవళిక ఆత్మహత్య పాపం కేసీఆర్, వారి ప్రభుత్వానిదేనని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ( Kishan Reddy ) అన్నారు.
హైదరాబాద్: ప్రవళిక ఆత్మహత్య పాపం కేసీఆర్, వారి ప్రభుత్వానిదేనని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ( Kishan Reddy ) అన్నారు. సోమవారం నాడు బీజేపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ప్రవళిక అత్యహత్యను వాడుకోవటం సిగ్గుచేటు. కేసీఆర్ పాలనలో టీఎస్పీఎస్సీ పరీక్షలు 17సార్లు వాయిదా పడ్డాయి. గ్రూపు పరీక్షల వాయిదాలో కేసీఆర్ సర్కార్ గిన్నీస్ రికార్డు సాధించింది. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని కేసీఆర్ సర్కార్ నీరు గార్చేసింది. టీచర్స్, లెక్చరర్స్ భర్తీ చేయటంలో కేసీఆర్ సర్కార్ విఫలం అయింది. తెలంగాణ వచ్చాక యూనివర్సిటీలు కళావిహీనంగా మారాయి’’ అని కిషన్ రెడ్డి అన్నారు.
Updated Date - 2023-10-30T20:35:04+05:30 IST