ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Muhammad Ali: కాంగ్రెస్ పాలనలో ముస్లిం పిల్లలు హోటలల్లో చాయికప్పులు కడిగేవారు

ABN, First Publish Date - 2023-11-23T22:15:43+05:30

కాంగ్రెస్ పాలనలో ముస్లిం పిల్లలు హోటలల్లో చాయికప్పులు కడిగేవారని హోం మంత్రి మహమ్మద్ అలీ ( Home Minister Muhammad Ali ) అన్నారు.

సిద్దిపేట: కాంగ్రెస్ పాలనలో ముస్లిం పిల్లలు హోటలల్లో చాయికప్పులు కడిగేవారని హోం మంత్రి మహమ్మద్ అలీ ( Home Minister Muhammad Ali ) అన్నారు. గురువారం నాడు హుస్నాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో హోం మంత్రి మహమ్మద్ అలీ, బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ మాట్లాడుతూ..‘‘కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల పరిపాలనలో ముస్లింలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వలేదు. పదేళ్ల పాటు ముస్లింలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది. తెలంగాణ వచ్చాక మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను సీఎం కేసీఆర్ స్థాపించారు. వీటిలో 1,50,000 మంది ముస్లిం పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు. విద్య, వైద్య రంగంలో ముస్లింలకు కేసీఆర్ ప్రత్యేక స్థానం కల్పించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ కుటుంబాన్ని ఆదరించాలి. సతీష్ కుమార్‌‌ను ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలి’’ అని హోం మంత్రి మహమ్మద్ అలీ పేర్కొన్నారు.

Updated Date - 2023-11-23T22:16:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising