Balaram Naik: గిరిజనులను మోసగిస్తున్నకేసీఆర్‌ని ఓడించాలి
ABN, First Publish Date - 2023-11-21T17:00:33+05:30
గిరిజనులను మోసగిస్తున్న సీఎం కేసీఆర్ ( CM KCR ) ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలని మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ (Balaram Naik ) అన్నారు.
హైదరాబాద్: గిరిజనులను మోసగిస్తున్న సీఎం కేసీఆర్ ( CM KCR ) ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలని మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ (Balaram Naik ) అన్నారు. మంగళవారం నాడు గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘12 శాతం రిజర్వేషన్ అని కేసీఆర్ మోసం చేశాడు. తండాలను గ్రామ పంచాయతీలను చేస్తానని మాట తప్పాడు. గిరిజన తెగలకు కార్పొరేషన్ నుంచి పైసా రాలేదు. ఆర్ధికంగా బలోపేతం చేస్తామని మోసం చేశారు. గిరిజనులు కేసీఆర్‌కి ఈ ఎన్నికల్లో బుద్ధి చెబుతారు. కేసీఆర్‌కి ఓటమి తప్పదు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ జరగలేదు. ఐటీడీఏ ఫండ్స్ ఏమయ్యాయి. కాంగ్రెస్ పార్టీనే ఈ ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీనే పోడు భూముల చట్టం తెచ్చింది. కేసీఆర్ గిరిజనులకు మాటలు చెప్పి మోసం చేస్తున్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు. ట్యాంక్ బండ్ పైన చెట్లు పెడితే డెవలప్మెంట్ అయినట్లు కాదు. ఉద్యమకారులకు కేసీఆర్ ఏం చేసిండు. లుంబిని పార్క్ వద్ద బంగ్లా కడితే అభివృద్ధి కాదు. గిరిజనులకు కాంగ్రెస్ మాత్రమే మేలు చేసింది. తెలంగాణ ఇచ్చిన సోనియాగాందీకు కాంగ్రెస్ గెలిపించి గిఫ్ట్‌గా ఇవ్వాలి. మాకు టికెట్ రాకపోయినా మేము కమిట్మెంట్‌గా ఉన్నాం’’ అని బలరాం నాయక్ తెలిపారు.
Updated Date - 2023-11-21T17:00:39+05:30 IST