ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mohammed Siraj: ప్రపంచ నంబర్ వన్‌గా అవతరించిన మహ్మద్ సిరాజ్

ABN, First Publish Date - 2023-09-20T15:32:08+05:30

ఆసియా కప్ ఫైనల్‌లో ఒంటి చేతితో టీమిండియాను గెలిపించిన స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 8 స్థానాలు ఎగబాకి నంబర్ వన్ బౌలర్‌గా అవతరించాడు.

ఆసియా కప్ ఫైనల్‌లో ఒంటి చేతితో టీమిండియాను గెలిపించిన స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 8 స్థానాలు ఎగబాకి నంబర్ వన్ బౌలర్‌గా అవతరించాడు. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో సిరాజ్ మొదటి స్థానానికి చేరుకోవడం ఈ ఏడాది జనవరి నుంచి ఇది రెండో సారి కావడం గమనార్హం. ప్రస్తుతం సిరాజ్ ఖాతాలో 694 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు సిరాజ్ ఖాతాలో 637 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఫైనల్‌ తర్వాత సిరాజ్ ఖాతాలో ఏకంగా 57 పాయింట్స్ వచ్చి చేరాయి. దీంతో 9వ స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకాడు. దీంతో మొదటి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ రెండో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం హేజిల్‌వుడ్ ఖాతాలో 678 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. కాగా శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఒకే ఓవర్‌లో 4 వికెట్లు తీయడంతోపాటు మ్యాచ్ మొత్తంలో 21 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు.


ఈ క్రమంలో ఒకే ఓవర్‌లో 4 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. అలాగే ఈ మ్యాచ్‌లో సిరాజ్ నమోదు చేసిన గణాంకాలు టీమిండియా తరఫున నాలుగో అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో తీసిన వికెట్ల ద్వారా ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. ఈ టోర్నీ మొత్తంలో సిరాజ్ 6 వికెట్లు తీశాడు. ఇక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ముగ్గురు భారత ఆటగాళ్లు టాప్ 10లో కొనసాగుతున్నారు. శుభ్‌మన్ గిల్ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. విరాట్ కోహ్లీ ఒక స్థానం ఎగబాకి 8వ స్థానానికి చేరుకున్నాడు. ఆసియా కప్‌లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు కొట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే ఆల్‌ రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా ఆరో స్థానంలో ఉన్నాడు.

Updated Date - 2023-09-20T15:32:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising