ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Team india: టీమిండియా ప్లేయర్‌తో సెల్పీల కోసం వందలాది అభిమానుల రాక.. భద్రత కట్టుదిట్టం

ABN, First Publish Date - 2023-12-11T13:54:24+05:30

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో ఈ సీనియర్ పేసర్ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆరంభంలోనే కొన్ని మ్యాచ్‌లకు తుది జట్టులో చోటు దక్కలేదు.

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో ఈ సీనియర్ పేసర్ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆరంభంలోనే కొన్ని మ్యాచ్‌లకు తుది జట్టులో చోటు దక్కలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. సునాయసంగా వికెట్లు తీస్తూ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. జట్టులోకి ఆలస్యంగా వచ్చినప్పటికీ ఈ ప్రపంచకప్‌లో ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ ప్రపంచకప్‌లో షమీ 24 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో అభిమానుల్లో షమీ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. ఒకప్పుడు షమీని దేశ్ర ద్రోహి అంటూ విమర్శించిన వారే ఇప్పుడు జేజేలు కొడుతున్నారు. దీంతో షమీతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. ఈ క్రమంలో షమీ స్వగ్రామంలో అతడిని కలవడానికి అభిమానులు తరలి వచ్చారు. అతనితో సెల్పీలు దిగడానికి వందలాది మంది అభిమానులు షమీ ఫామ్‌ హౌజ్ వద్ద క్యూకట్టారు. దీంతో షమీ ఫామ్ హౌస్ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు.


ఇందుకు సంబంధించిన వీడియోను షమీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. సదరు వీడియోలో షమీ ఫామ్ హౌస్ వద్ద వందలాది అభిమానులు క్యూ కట్టడం కనిపిస్తోంది. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండడంతో అక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడం కూడా వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కాగా వరల్డ్‌కప్‌లో అదరగొట్టిన మహ్మద్ షమీ ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. వరల్డ్ కప్ అనంతరం ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌తోపాటు సౌతాఫ్రికాతో వన్డే, టీ20 సిరీస్‌కు కూడా షమీ దూరంగా ఉన్నాడు. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ నాటికి భారత జట్టులో చేరనున్నాడు. అయితే షమీ ప్రస్తుతం తన చీలమండ గాయానికి చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం. దీంతో సఫారీలతో టెస్ట్ సిరీస్ ఆరంభమయ్యేనాటికి పూర్తిగా కోలుకుంటాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. కాగా సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఈ నెల 26 నుంచి ప్రారంభంకానుంది.

Updated Date - 2023-12-11T14:10:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising