ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: లోయలో ఊయల ఊగుతున్న యువతులు.. యువకుడి అత్యుత్సాహంతో చివరకు ఏమైందంటే..

ABN, First Publish Date - 2023-03-14T21:18:26+05:30

ప్రకృతి అందాల మధ్యలో పక్షిలా గాల్లో విహరిస్తూ ఉంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే వేల అడుగుల ఎత్తులో అందమైన కొండల మధ్య, లోయల ఊయల ఊగితే ఇంకెలా ఉంటుందీ అంటే.. అద్భుతం అని ప్రతి ఒక్కరూ అంటారు. అయితే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రకృతి అందాల మధ్యలో పక్షిలా గాల్లో విహరిస్తూ ఉంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే వేల అడుగుల ఎత్తులో అందమైన కొండల మధ్య, లోయల ఊయల ఊగితే ఇంకెలా ఉంటుందీ అంటే.. అద్భుతం అని ప్రతి ఒక్కరూ అంటారు. అయితే ఇలాంటి ఆనందకర సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా.. ఊహించని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి అనూహ్య ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం లోయలో ఊయల ఊగుతున్న యువతుల వీడియో తెగ వైరల్ అవుతోంది. యువతులు ఊయల ఊగుతుండగా.. యువకుడి అత్యుత్యాహంతో చివరకు ఏమైందంటే..

సోషల్ మీడియాలో యువతులకు సంబంధించిన వీడియో ఒకటి తెగ చక్కర్లు (Viral videos) కొడుతోంది. రష్యాలో (Russia) చాలా కాలం క్రితం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో.. ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. పర్యాటకులను ఆకట్టుకునేందుకు సుమారు 6300 అడుగుల ఎత్తైన కొండ మీద ఊయల ఏర్పాటు చేశారు. పక్కనే లోయ ఉండడంతో ఊయల ఊగిన వారికి లోయల దూకిన అనుభూతి కలుగుతుంది. కాగా, ఇద్దరు యువతులు (young women) అందరిలాగే ఊయల ఊగుతూ ఉంటారు. పక్కనే నిలబడ్డ యువకుడు ఊయలను (Swinging) ఊపుతూ ఉంటాడు. అయితే సదరు వ్యక్తి.. కాస్త అత్యుత్సాహంతో మరింత గట్టిగా ఊపేస్తాడు.

మందు కొట్టి స్నేహితుడి ఇంటికి వెళ్లిన యువకుడు.. సరదాగా మాట్లాడుతూ ఒక్కసారిగా.. ‘‘నీ భార్యను నా వద్దకు పంపించు’’.. అని అడగడంతో..

ఊయల వేగంగా కదులుతుండడంతో యువతులు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే కొద్ది సేపటి తర్వాత ఆ వ్యక్తి ఊయలను మరింత గట్టిగా ఊపేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో ఒక్కసారిగా అదుపు తప్పిన ఊయల ఇనుప రాడ్డుకు తగులుతుంది. ఓ వైపు చైన్ తెగిపోవడంతో ఇద్దరు యువతులు లోయలో పడిపోతారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. అయితే అదృష్టవశాత్తు ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి మరి..

Viral Video: మొబైల్ ధ్యాసలో పడితే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడి వాలకం చూసి పగలబడి నవ్వుకుంటున్న నెటిజన్లు..

Updated Date - 2023-03-14T21:18:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising