ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: ప్రియుడు వంట చేస్తోంటే.. సాయంగా వెళ్లడమే ఆ ప్రేయసి పొరపాటయింది.. దాన్ని వాసన చూడటంతో..!

ABN, First Publish Date - 2023-09-02T15:26:21+05:30

కాలం కలసిరాకపోతే తాడు కూడా పామై కాటు వేస్తుంది.. అని పెద్దలు చెబుతూ ఉంటారు. కొందరి జీవితంలో ఇలాంటి సందర్భాలు అప్పుడప్పుడూ ఎదురవుతుంటాయి. అంతవరకూ బాగున్న వారు అనుకోని విధంగా ఊహించని ప్రమాదాల్లో చిక్కుకుంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు..

ప్రతీకాత్మక చిత్రం

కాలం కలసిరాకపోతే తాడు కూడా పామై కాటు వేస్తుంది.. అని పెద్దలు చెబుతూ ఉంటారు. కొందరి జీవితంలో ఇలాంటి సందర్భాలు అప్పుడప్పుడూ ఎదురవుతుంటాయి. అంతవరకూ బాగున్న వారు అనుకోని విధంగా ఊహించని ప్రమాదాల్లో చిక్కుకుంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతి విషయంలో ఇలాగే జరిగింది. ప్రియుడు వంట చేస్తోంటే.. సాయం చేద్దామని వెళ్లింది. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఓ వస్తువును వాసన చూడడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. 6నెలలుగా ఆమె కోమాలోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

బ్రెజిల్‪‌కు (Brazil) చెందిన 25ఏళ్ల థాయిస్ అనే యువతికి (young woman) విచిత్ర సమస్య వచ్చి పడింది. ఫిబ్రవరిలో ఈమె తన ప్రియుడితో కలిసి ఇంట్లో ఉండగా.. ఊహించని ఘటన చోటు చేసుకుంది. తన ప్రియుడు వంట గదిలో వంట సిద్ధం చేస్తున్నాడు. దీంతో థాయిస్ కూడా వంట గదిలోకి వెళ్లి అతడికి సాయం చేస్తోంది. ఈ సమయంలో ఆమె అనుకోకుండా అక్కడే ఉన్న మండే స్వభావం గల పెప్పర్‌ను ముక్కు వద్ద పెట్టుకుని వాసన చూసింది. దీంతో ఒక్కసారిగా ఆమె అస్వస్థతకు (Illness) గురైంది. వాసన చూసిన కాసేపటికి ఆమె గొంతులో దురద మొదలైంది. క్షణాల్లోనే అది మరింత పెద్దదైంది. దీంతోపాటూ మాట్లాడానికి కూడా కష్టంగా మారింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో ఆమె మెదడు సంబంధిత సమస్య (Brain related problem) తలెత్తినట్లు గుర్తించారు.

Viral Video: వావ్!.. ఈ గ్రామస్తుల తెలివితేటలు అమోఘం.. అడవి మధ్యలో ఇరుక్కుపోయిన కారును చిన్న ట్రిక్‌తో ఎలా బయటికి తీశారంటే..

పరిస్థితి విషమించడంతో ఆమె కోమాలోకి వెళ్లింది. ఆమె అంతకుముందు ఆస్తమాతో సహా వివిధ రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేది. కొత్తగా తలెత్తిన సమస్యతో పాటూ ఆస్తమా తదితర వ్యాధులన్నీ మళ్లీ తిరగబెట్టాయి. దీంతో యువతి కోలువడం కష్టమైంది. అయితే ఆరోగ్యం కాస్త కుదుట పడడంతో జూలై 31న ఆమెను డిశ్చార్జి చేశారు. అయితే ఇంటికి వెళ్లిన కొద్ది రోజులకు ఆమెకు తీవ్ర జ్వరం మొదలైంది. దీంతో ఆగస్టు 10న మళ్లీ ఆమెను ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఊపిరితిత్తులకు సంబంధిత సమస్యలు కూడా ఎక్కువవయ్యాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం ఈమెకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యువతి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఏనుగు పవర్ ఏంటో ఎప్పుడైనా చూశారా.. అంతెత్తున ఉన్న పనస పండ్లను ఎలా తెంచేసిందో చూడండి..

Updated Date - 2023-09-02T15:26:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising