Viral Video: ఏనుగు పవర్ ఏంటో ఎప్పుడైనా చూశారా.. అంతెత్తున ఉన్న పనస పండ్లను ఎలా తెంచేసిందో చూడండి..

ABN , First Publish Date - 2023-09-01T15:41:52+05:30 IST

ఏనుగు ఎంత శక్తివంతమైన జంతువో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఏ జంతువైనా ఏనుగు జోలికి వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంది. ఏనుగు ఒక్కసారి ఘీంకరించిందంటే.. ఆ శబ్ధానికి పులులు, సింహాలు సైతం ఆమడదూరం పారిపోతుంటాయి. కొన్నిసార్లు ఏనుగులు కోపంతో ...

Viral Video: ఏనుగు పవర్ ఏంటో ఎప్పుడైనా చూశారా.. అంతెత్తున ఉన్న పనస పండ్లను ఎలా తెంచేసిందో చూడండి..

ఏనుగు ఎంత శక్తివంతమైన జంతువో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఏ జంతువైనా ఏనుగు జోలికి వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంది. ఏనుగు ఒక్కసారి ఘీంకరించిందంటే.. ఆ శబ్ధానికి పులులు, సింహాలు సైతం ఆమడదూరం పారిపోతుంటాయి. కొన్నిసార్లు ఏనుగులు కోపంతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో పెద్ద పెద్ద వృక్షాలను సైతం అవలీలగా పెకలించడం చాలా సార్లు చూశాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ ఏనుగు వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆకలితో ఉన్న ఏనుగు.. అందనంత ఎత్తులో ఉన్న పనసపండ్లను తెంచేయడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఏనుగుకు విపరీతంగా ఆకలి వేసినట్లుంది. అటూ ఇటూ చూస్తున్న ఏనుగుకు (elephant) ఎదురుగా ఓ పెద్ద పనస చెట్టు (jackfruit tree) కనిపించింది. అయితే పనసకాయలు మాత్రం అందనంత ఎత్తులో ఉన్నాయి. వాటిని తెంచడం ఏనుగు వల్ల సాధ్యం కాదని అంతా అనుకుంటారు. అయితే ఎలాగైనా పనస పండ్లను తినేయాలని చెట్టు దగ్గరికి వెళ్తుంది. అయితే తొండం పైకి ఎత్తినా పండ్లు అందలేదు. దీంతో తర్వాత చెట్టు కొమ్మను వంచాలని చూస్తుంది.

Viral Video: ఇది కదా ప్రేమంటే.. తల్లిని మించిన యోధురాలు ఇంకెవరూ లేరనడానికి ఈ వీడియోనే నిదర్శనం..

అప్పటికీ పండ్లను తెంచడం మాత్రం సాధ్యం కాదు. ఇలాగైతే కాదనుకుందో ఏమో.. చివరకు రెండు కాళ్లను చెట్టు మొదలుపై ఉంచి.. తొండాన్ని పైకి చాపి పండ్లను అవలీలగా తెంచేసింది. కిందపడ్డ పండ్లను ఆరగిస్తూ తన ఆకలిని తీర్చేసుకుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఈ ఏనుగు పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఏనుగా మజాకా’’.. అంటూ మరికొందరు, ‘‘ఈ ఏనుగుకు ఫ్రూట్స్ అంటే ఇష్టం అనుకుంటా’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Triangle love story: ప్రేయసితో కలిసి కారులో షికారుకెళ్లిన ప్రియుడు.. మార్గ మధ్యలో డ్రైవర్‌ ఎవరో తెలుసుకుని తేరుకునేలోపే..

Updated Date - 2023-09-26T12:28:02+05:30 IST