Viral Video: ఆగి ఉన్న విమానం వద్ద సిబ్బంది చేసిన పని చూసి ప్రయాణికుడు షాక్.. వెంటనే వీడియో తీయడంతో చివరికి ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-08-31T16:29:24+05:30 IST

‘‘కుక్కపిల్ల.. అగ్గిపుల్ల.. సబ్బు బిళ్ల.. కాదేదీ కవితకు అనర్హం’’.. అన్న చందంగా.. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో రీల్స్ చేసేందుకు పేదా, ధనిక.. పెద్దా, చిన్నా.. ఉద్యోగులూ, నిరుద్యోగులూ.. అనే తేడా లేకుండా పోయింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడంతో కంటికి ఎదురుగా కాస్త వినూత్నంగా ఏది కనిపించినా..

Viral Video: ఆగి ఉన్న విమానం వద్ద సిబ్బంది చేసిన పని చూసి ప్రయాణికుడు షాక్.. వెంటనే వీడియో తీయడంతో చివరికి ఏం జరిగిందంటే..

‘‘కుక్కపిల్ల.. అగ్గిపుల్ల.. సబ్బు బిళ్ల.. కాదేదీ కవితకు అనర్హం’’.. అన్న చందంగా.. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో రీల్స్ చేసేందుకు పేదా, ధనిక.. పెద్దా, చిన్నా.. ఉద్యోగులూ, నిరుద్యోగులూ.. అనే తేడా లేకుండా పోయింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడంతో కంటికి ఎదురుగా కాస్త వినూత్నంగా ఏది కనిపించినా.. ఇలా వీడియోలు చేసి, అలా నెట్టింట్లోకి వదులుతున్నారు. వీటిలో కొన్ని తెగ వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆగి ఉన్న విమానం వద్ద సిబ్బంది చేసిన పని చూసి ప్రయాణికుడు షాక్ అయ్యాడు. వెంటనే వీడియో తీయడంతో చివరికి ఏం జరిగిందంటే..

అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ (Buenos Aires) విమానాశ్రయం నుంచి స్విజ్జర్లాండ్‌లోని (Switzerland) జ్యూరిచ్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బోయింగ్ 777 విమానాన్ని సిద్ధం చేసి విమానాశ్రయంలో పార్కింగ్ చేశారు. కాసేపు ఉంటే ప్రయాణికులు అందులోకి ఎక్కుతారనగా.. అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అదే సమయంలో టెర్మినల్‌లో వేచి ఉన్న ప్రయాణికుడికి.. విమానం వద్ద ఏదో అనుమానాస్పందగా కనిపించడంతో కెమెరాను జూమ్ చేశాడు. దీంతో చివరికి అక్కడి ఘటనను చూసి అవాక్కయ్యాడు. విమాన క్యాబిన్ సిబ్బంది (Flight cabin crew) బయటికి వచ్చి విమానం చుట్టూ గెంతులేస్తూ, మరికొందరు ఫొటోలు తీసుకుంటూ కనిపించారు. ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తున్న ఓ యువతి.. క్యాబిన్ నుంచి రెక్క పైకి వచ్చి చిన్న చిన్న స్టెప్పులు వేస్తూ.. వివిధ రకాల భంగిమల్లో ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ ఉంది.

Woman: 3 వారాలుగా ఓ మహిళకు జ్వరం.. ఎమ్మారై స్కాన్ చేసిన డాక్టర్లకు షాక్.. ఏం చేయాలో తెలియక శాస్త్రవేత్తల వద్దకు వెళ్తే..!

అలాగే విమానం కింద గమనించగా.. అక్కడున్న సిబ్బంది కూడా దాని ఎదురుగా నిల్చుని ఫొటోలు దిగుతున్నారు. విమానాన్ని ఎప్పుడూ చూడలేదన్నట్లుగా ఆత్రుతగా ఒకరిని మంచి మరొకరు సెల్ఫీలు తీసుకోవడం కనిపించింది. ఇంకో వ్యక్తి ఓ అడుగు ముందుకేసి.. విమాన రెక్కపై జేబ్స్‌బాండ్ తరహాలో కెమెరాకు ఫోజులు ఇచ్చాడు. ఈ ఘటనను వీడియో తీసిన ప్రయాణికుడు.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. దీనిపై స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (Swiss International Airlines) సీరియస్ అయింది. విమానంలో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగిందని, విచారణ అనంతరం కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఇదెక్కడి గేమ్‌రా బాబోయ్.. యువకుడిని టైరులో కుక్కి తోయడంతో చివరకి ఏం జరిగిందో చూడండి..

Updated Date - 2023-08-31T16:31:15+05:30 IST