Viral Video: ప్రాణభయంతో ప్రశాంతంగా తినగలరా..? లక్షలు ఇస్తామన్నా ఈ రిస్క్ చేయలేమంటున్న నెటిజన్లు..!

ABN , First Publish Date - 2023-08-29T15:33:13+05:30 IST

‘‘భయం చాలా విలువైనది.. భయం లేనివాడు బ్రతకడం చాలా కష్టం’’ అని ఓ సినీ కవి అంటే.. అదే కవి ‘‘జీవితంలో భయపడాలి కానీ.. భయమే జీవితం కాకూడదు’’.. అని కూడా అంటాడు. ఈ సూక్తులకు తగ్గట్టుగానే కొందరు భయమే జీవితంగా గడుపుతుంటే.. మరికొందరు జీవితంలో దేనికీ భయపడకుండా ముందుకెళ్తుంటారు. ఈ క్రమంలో...

Viral Video: ప్రాణభయంతో ప్రశాంతంగా తినగలరా..? లక్షలు ఇస్తామన్నా ఈ రిస్క్ చేయలేమంటున్న నెటిజన్లు..!

‘‘భయం చాలా విలువైనది.. భయం లేనివాడు బ్రతకడం చాలా కష్టం’’ అని ఓ సినీ కవి అంటే.. అదే కవి ‘‘జీవితంలో భయపడాలి కానీ.. భయమే జీవితం కాకూడదు’’.. అని కూడా అంటాడు. ఈ సూక్తులకు తగ్గట్టుగానే కొందరు భయమే జీవితంగా గడుపుతుంటే.. మరికొందరు జీవితంలో దేనికీ భయపడకుండా ముందుకెళ్తుంటారు. ఈ క్రమంలో కొందరు ఓ అడుగు ముందుకేసి.. ఒళ్లు గగుర్పొడిచే సాహసాలు చేస్తూ.. అందరినీ భయపెడుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దంపతులు ఆకాశ వీధిలో వేలాడుతూ ప్రశాంతంగా భోజనం చేయడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. లక్షలు ఇస్తామన్నా ఇలాంటి రిస్క్ చేయలేమంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. చాలా పర్యాటక ప్రదేశాల్లో (Tourist places) రోప్ వేలో ఆకాశ వీధిలో అటూ ఇటూ కదులుతూ ఎంజాయ్ చేయడం చూస్తూ ఉంటాం. ఇలా మీరు చేయగలరా.. అంటే ఎందుకు చేయలేం అని టక్కున సమాధాంన ఇస్తారు. అయితే అదే రోప్ వేలో అత్యంత ఎత్తులో ఓ టేబుల్‍‌పై కూర్చుని భోజనం చేయమంటే మాత్రం వెంటనే ఆలోచనలో పడిపోతారు. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ జంట ఇలాంటి సాహసాన్ని సరదా సరదాగా చేయడం చూసి అంతా అవాక్కవుతన్నారు. బ్రెజిల్‍‌లోని ఓ జలపాతం (Brazil Falls) వద్ద 295 అడుగుల ఎత్తులో రోప్ వే (rope way) ఏర్పాటు చేశారు.

Viral Video: ఖరీదైన బైకులో పారిపోయిన దొంగలను.. స్కూటీపై వెంబడించిన పోలీసులు.. నాలుగే నాలుగు నిముషాల్లో ఎవరూ ఊహించని ట్విస్ట్..

అయితే మిగతా రోప్ వేలలో మాదిరి ఓ బాక్సు వంటిది కాకుండా.. ఇక్కడ వెరైటీగా డైనింగ్ టేబుల్‌ని ఏర్పాటు చేశారు. అంతెత్తులో అందులో కూర్చుని భోజనం తింటూ ఎంజాయ్ చేయాలంటే మాత్రం.. 15 నిముషాలకు అక్షరాలా రూ.37వేలు చెల్లించాలట. ఓ జంట డైనింగ్ టేబుల్‍పై కూర్చుని ఇష్టమైన ఫుడ్‌ని తింటూ ఏమాత్రం భయం లేకుండా ఎంజాయ్ చేయడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ‘‘మేము చెల్లించడం కాదు.. మాకే లక్షలు ఫ్రీగా ఇస్తామన్నా ఇలాంటి సాహసం చేయలేం బాబోయ్’’.. అంటూ కొందరు, ‘‘ఈ జంట ధైర్యసాహసాలకు హ్యాట్సాప్’’.. అంటూ మరికొందరు, ‘‘డబ్బులు ఖర్చు చేసి భయాన్ని కొనుక్కోవడం అంటే ఇదేనేమో’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ పిల్లాడి టాలెంట్‌కు ఫిదా అవాల్సిందే.. ఒక్క చక్రమే ఉన్న సైకిల్‌పై కూర్చుని.. ఒంటి కాలితో తొక్కుతూనే..!

Updated Date - 2023-08-29T15:33:13+05:30 IST