Viral Video: ఈ పిల్లాడి టాలెంట్‌కు ఫిదా అవాల్సిందే.. ఒక్క చక్రమే ఉన్న సైకిల్‌పై కూర్చుని.. ఒంటి కాలితో తొక్కుతూనే..!

ABN , First Publish Date - 2023-08-29T14:43:11+05:30 IST

పిల్లల తెలివితేటలు చూస్తే.. కొన్నిసార్లు పెద్దలు కూడా పనికిరారు అన్నట్లుగా ఉంటాయి. కొందరు పిల్లలైతే చిన్న వయసులోనే పెద్ద పెద్ద విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుబాటులో ఉండడంతో ఇలాంటి పిల్లలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా..

Viral Video: ఈ పిల్లాడి టాలెంట్‌కు ఫిదా అవాల్సిందే.. ఒక్క చక్రమే ఉన్న సైకిల్‌పై కూర్చుని.. ఒంటి కాలితో తొక్కుతూనే..!

పిల్లల తెలివితేటలు చూస్తే.. కొన్నిసార్లు పెద్దలు కూడా పనికిరారు అన్నట్లుగా ఉంటాయి. కొందరు పిల్లలైతే చిన్న వయసులోనే పెద్ద పెద్ద విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుబాటులో ఉండడంతో ఇలాంటి పిల్లలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి పిల్లాడి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఒకే చక్రం మాత్రమే ఉన్న సైకిల్‌పై ఓ పిల్లాడు చేసిన విన్యాసం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ బాలుడు ఒకే చక్రం ఉన్న (single wheel cycle) సైకిల్‌పై ఎక్కి కూర్చుంటాడు. దానికి చైన్, పెడల్ బిగించి, కాలితో తొక్కడం ద్వారా ముందుకు కదిలేలా ఏర్పాటు చేశారు. దీనిపై కిందపడకుండా కూర్చోవడమే గగనం అనుకుంటే.. ఓ పిల్లాడు కూర్చోవడమే కాకుండా దానిపై ఎవరికీ సాధ్యం కాని స్టంట్‌ని (boy stunt) అవలీలగా చేసేశాడు. ఒంటి చక్రం సైకిల్‌పై కూర్చున్న బాలుడు.. ఓ కాలిపై కొన్ని పేట్లను ఉంచుకుని, మరో కాలితో పెడల్ తొక్కుతూ సైకిల్‌ను చాలా సేపు బ్యాలెన్స్ చేస్తాడు. ఇలా ముందుకు, వెనక్కు తొక్కుతూ బ్యాలెన్స్ చేసే క్రమంలోనూ మరో కాలి పాదంపై ఉన్న పేట్లు కింద పడకుండా చూసుకుంటాడు.

Viral Video: ఆకాశంలో పారాచూట్ చిక్కుపడడంతో.. భూమి పైకి దూసుకొచ్చిన వ్యక్తి.. ఇక మరణం ఖాయం అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా..

అలాగే అతడి తలపై మరో ప్లేటు కూడా ఉంటుంది. కొద్ది సేపు సైకిల్‌ను అటూ, ఇటూ కదిలించిన తర్వాత ఉన్నట్టుండి కాలిపై ఉన్న ప్లేట్లను పైకి ఎగరేస్తాడు. గాలిలోకి లేచిన ప్లేట్లు ఆశ్చర్యకంరగా ఒక్కొక్కటిగా వెళ్లి.. అతడి తలపై ఉన్న ప్లేటులో వరసగా పడిపోతాయి. ఈ విన్యాసం జరుగుతున్నంత సేపూ అతను సైకిల్‌ను అలా ముందుకు, వెనక్కు తొక్కుతూనే ఉంటాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘వావ్! ఇతడి ట్యాలెంట్ అమోఘం’’.. అంటూ కొందరు, ‘‘ఇతడికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలా చేయడం ఎవరికీ సాధ్యం కాదేమో’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఖరీదైన బైకులో పారిపోయిన దొంగలను.. స్కూటీపై వెంబడించిన పోలీసులు.. నాలుగే నాలుగు నిముషాల్లో ఎవరూ ఊహించని ట్విస్ట్..

Updated Date - 2023-08-29T14:43:11+05:30 IST