Indian Army: వీరమరణం పొందిన ఆ జవాన్ కోసం.. ఊరు ఊరంతా కదిలొచ్చింది.. రాత్రికి రాత్రే గ్రామానికి రోడ్డు వేసి..!

ABN , First Publish Date - 2023-08-24T07:58:55+05:30 IST

సుఖ సంతోషాలను పక్కన పెట్టి.. కుటుంబాలకు దూరంగా.. దేశ రక్షణే ధ్యేయంగా పని చేస్తుంటారు ఆర్మీ జవాన్లు. అవసరమైతే తమ ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడుతుంటారు. అందుకే సైనికులు ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి అమితమైన గౌరవమర్యాదలు లభిస్తుంటాయి. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే సైనికుడు ..

Indian Army: వీరమరణం పొందిన ఆ జవాన్ కోసం.. ఊరు ఊరంతా కదిలొచ్చింది.. రాత్రికి రాత్రే గ్రామానికి రోడ్డు వేసి..!

సుఖ సంతోషాలను పక్కన పెట్టి.. కుటుంబాలకు దూరంగా.. దేశ రక్షణే ధ్యేయంగా పని చేస్తుంటారు ఆర్మీ జవాన్లు. అవసరమైతే తమ ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడుతుంటారు. అందుకే సైనికులు ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి అమితమైన గౌరవమర్యాదలు లభిస్తుంటాయి. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే సైనికుడు కూడా ఈ కోవకే చెందుతాడు. అతడంటే తన గ్రామ ప్రజలతో పాటూ చుట్టుపక్కల ప్రాంతాల వారికీ ఎంతో అభిమానం. అయితే ఉన్నట్టుండి ఆ జవాన్ వీర మరణం పొందాడనే వార్తను విని కన్నీరుమున్నీరయ్యారు. రాత్రికి రాత్రే గ్రామానికి రోడ్డు వేసి.. జవాను పట్ల వారు చూపిన అభిమానం చూసి అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వివరాల్లోకి వెళితే..

హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) సిమ్లా రూరల్ జిల్లా దడ్గి గ్రామానికి చెందిన బూబు రామ్ శర్మ కుమారుడు విజయ్ కుమార్ అనే యువకుడు ఆర్మీలో (Army) పని చేస్తుండేవాడు. అయితే దురదృష్టవశాత్తు లేహ్ - లడఖ్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో (road accident) మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. విజయ్ కుమార్ ఇక లేరన్న వార్తను గ్రామస్తులు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఊరు ఊరంతా అతడి చివరి చూపు కోసం కళ్లు కాయలుకాచేలా ఎదురుచూసింది. అయితే గ్రామంలో ఎప్పటినుంచో శ్మశాన వాటికకకు సరైన రోడ్డు మార్గం లేదు. విజయ్ కుమార్ దహన సంస్కారాలకు (Cremation) ఇది ఇబ్బంది అవుతుందని భావించిన గ్రామస్తులు.. వెంటనే దారి నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ప్రధాన రహదారి నుంచి శ్మశాన వాటిక వరకూ సుమారు 400 మీటర్ల మేర రోడ్డును రాత్రికి రాత్రే తయారు చేశారు.

Woman Constable: లింగమార్పిడి చేయించుకోవాలనుకున్న మహిళా కానిస్టేబుల్‌కు వింత కష్టం.. న్యాయం కోసం హైకోర్టుకెళ్తే..!

army.jpg

ఆదివారం రాత్రి 8గంటలకు పనులు ప్రారంభించి, ఉదయం కల్లా రహదారిని సిద్ధం చేశారు. రోడ్డు కోసం చాలా మంది గ్రామస్తులు తమ భూమిని విరాళంగా ఇచ్చారు. అలాగే ఆ రోడ్డుకు కూడా విజయ్ కుమార్ మార్గ్ అని పేరు పెట్టారు. విజయ్ కుమార్‌కు నివాళులు అర్పించేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. విజయ్ కుమార్ తమతో ఎప్పుడూ సరదాగా ఉండేవాడని తెలిపారు. గ్రామానికి వచ్చినప్పుడల్లా పిల్లలందరినీ క్రీడల వైపు మళ్లేలా ప్రోత్సహించేవాడని, అలాగే సైన్యంలో చేరేందుకు సహాయసహకారాలు అందిచేవాడని గుర్తు చేసుకుని కన్నీటిపర్యంతమయ్యారు. విజయ్ కుమార్‌కు భార్య నిర్మల, ఏదాదిన్నర, ఏడేళ్ల వయసున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. విజయ్ కుమార్ అంతిమయాత్రలో.. భార్య పెళ్లికూతురు వేషధారణలో భర్తకు వీడ్కోలు పలకడం చూసి వచ్చినవారంతా కన్నీరుమున్నీరయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Shocking: బస్సు కోసం ఎదురు చూస్తున్న భార్యాభర్తలు.. సడన్‌గా పక్కనే వచ్చి ఆగిందో కారు.. తెలిసిన వ్యక్తే కదా అని ఎక్కితే..!

Updated Date - 2023-08-24T07:58:55+05:30 IST