Viral Video: ఖరీదైన బైకులో పారిపోయిన దొంగలను.. స్కూటీపై వెంబడించిన పోలీసులు.. నాలుగే నాలుగు నిముషాల్లో ఎవరూ ఊహించని ట్విస్ట్..

ABN , First Publish Date - 2023-08-24T11:03:22+05:30 IST

కలలో కూడా సాధ్యం కాని వింతలు, విశేషాలు, విన్యాసాలు, విచిత్రాలన్నీ సినిమాల్లో చూస్తుంటాం. హీరో, విలన్లు.. పోలీసు, దొంగల మధ్య తలెత్తే పోరాట సన్నివేశాలైతే.. ఇక చెప్పాల్సిన పని లేదు. ఊహకందని సీన్లతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంటారు. ఇలాంటి ఘటనలు నిజ జీవితంలో అసాధ్యం అనుకుంటాం. కానీ...

Viral Video: ఖరీదైన బైకులో పారిపోయిన దొంగలను.. స్కూటీపై వెంబడించిన పోలీసులు.. నాలుగే నాలుగు నిముషాల్లో  ఎవరూ ఊహించని ట్విస్ట్..

కలలో కూడా సాధ్యం కాని వింతలు, విశేషాలు, విన్యాసాలు, విచిత్రాలన్నీ సినిమాల్లో చూస్తుంటాం. హీరో, విలన్లు.. పోలీసు, దొంగల మధ్య తలెత్తే పోరాట సన్నివేశాలైతే.. ఇక చెప్పాల్సిన పని లేదు. ఊహకందని సీన్లతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంటారు. ఇలాంటి ఘటనలు నిజ జీవితంలో అసాధ్యం అనుకుంటాం. కానీ కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ ఆశ్చర్యాన్ని కలిగించే ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అలాంటి ఆశ్చర్యకరమైన సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దొంగలను పట్టుకునేందుకు స్కూటీపై పోలీసులు చేసిన సాహసం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. వియాత్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దొంగలు (thieves) పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో బైకుపై ఎక్కి వేగంగా దూసుకెళ్లిపోతారు. ప్రధాన రహదారిపై అడ్డదిడ్డంగా నడుపుతూ చూస్తుండగానే కళ్ల ముందు నుంచి అదృశ్యమవుతారు. అయితే పోలీసులు మాత్రం వారిని వదిలే ఆలోచనలో లేరు. ఎలాగైనా పది నిముషాల్లో పట్టుకోవాలని కంకణం కట్టుకుని అందుబాటులో ఉన్న ఓ స్కూటీపై (Police chasing thieves on scooty) చేజింగ్ చేస్తారు. ఖరీదైన బైకులో వెళ్తున్న దొంగలను స్కూటీలో చేజింగ్ చేయడం అసాధ్యం అని అంతా అనుకుంటారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పోలీసులు అత్యంత వేగంతో స్కూటీని నడుపుతారు. వారికి ముందు వైపు ఉన్న కెమెరాలో ఈ ఘటన మొత్తం రికార్డు అవుతుంటుంది.

La Rose Noire: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు.. ధర ఏకంగా రూ.250 కోట్లు.. అసలు దీని స్పెషాలిటీ ఏంటంటే..!

దొంగలను పట్టుకునే క్రమంలో మధ్య మధ్యలో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు కూడా.. రహదారిపై అడ్డదిడ్డంగా వెళ్లాల్సి వస్తుంది. అత్యంత వేగంగా వెళ్తున్నా కూడా మిగతా వాహనదారులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డ్రైవ్ చేస్తారు. మలుపుల వద్ద ఎంతో చాకచక్యంగా బండిని నడపడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎట్టకేలకు దొంగలను చేజింగ్ చేస్తారు. అయితే పోలీసులను చూడగానే.. దొంగలు వారి బైకును పక్కన పడేసి పరుగెత్తుకుంటూ వెళ్తారు. కాస్త దూరం వెళ్లగానే పోలీసులు వారిని పట్టుకుని, చేతులకు బేడీలు వేసి.. స్టేషన్‌కి తీసుకెళ్లిపోతారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! వీరు మామూలు పోలీసులు కాదురోయ్’’.. అంటూ కొందరు, ‘‘యాక్షన్ సినిమా చూస్తున్నట్లు ఉంది’’.. అని ఇంకొందరు, ‘‘ఇలాంటి పోలీసులు ఉంటే.. నేరాలు అదుపులో ఉంటాయ్’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Shocking: బస్సు కోసం ఎదురు చూస్తున్న భార్యాభర్తలు.. సడన్‌గా పక్కనే వచ్చి ఆగిందో కారు.. తెలిసిన వ్యక్తే కదా అని ఎక్కితే..!

Updated Date - 2023-08-24T11:04:04+05:30 IST