Viral Video: ఇది కదా ప్రేమంటే.. తల్లిని మించిన యోధురాలు ఇంకెవరూ లేరనడానికి ఈ వీడియోనే నిదర్శనం..

ABN , First Publish Date - 2023-08-31T17:53:31+05:30 IST

‘‘తల్లిని మించిన యోధురాలు ఇంకెవరూ లేరు’’.. అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి తల్లీ తన పిల్లలను కంటి రెప్పలా చూసుకుంటుంది. వారి సంక్షేమమే తన సంతోషంగా బతుకుతుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా..

Viral Video: ఇది కదా ప్రేమంటే.. తల్లిని మించిన యోధురాలు ఇంకెవరూ లేరనడానికి ఈ వీడియోనే నిదర్శనం..

‘‘తల్లిని మించిన యోధురాలు ఇంకెవరూ లేరు’’.. అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి తల్లీ తన పిల్లలను కంటి రెప్పలా చూసుకుంటుంది. వారి సంక్షేమమే తన సంతోషంగా బతుకుతుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఓ తల్లి ఓ వైపు తన వ్యాపారం చూసుకుంటూనే.. మరోవైపు తన పిల్లల పట్ల చూపిన శ్రద్ధను చూసి నెటిజన్లను ఫిదా అవుతున్నారు. ఇది కదా తల్లి ప్రేమంటే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

తెలిసీ తెలీని వయసులో పిల్లలు చేసే చిన్న చిన్న తప్పులను సరిదిద్ధాల్సింది పోయి.. వారి పట్ల కర్కశంగా ప్రవర్తించే తల్లిదండ్రులను చాలా మందిని చూశాం. అలాగే పిల్లల సంక్షేమం కోసం తమ ప్రాణాలను కూడా త్యాగం చేసే తల్లిదండ్రులను కూడా చూశాం. ఇలాంటి తల్లిదండ్రులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో (Viral Videos) తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం తల్లీపిల్లల మధ్య ఉండే అనుబంధాన్ని (bond between mother and child) తెలిపే ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన జార్ఖండ్‌లో (Jharkhand) జరిగినట్లుగా తెలుస్తోంది. ఓ మహిళ రోడ్డు పక్కన (roadside fruit stall) తోపుడు బండిపై ద్రాక్ష తదితర పండ్లను విక్రయిస్తుంటుంది.

Viral Video: ఇదెక్కడి గేమ్‌రా బాబోయ్.. యువకుడిని టైరులో కుక్కి తోయడంతో చివరకి ఏం జరిగిందో చూడండి..

కుటుంబ పోషణ నిమిత్తం ఆమె బాధ్యతలు తీసుకోవడంతో పాటూ పిల్లల బాధ్యతను కూడా తానే తీసుకుంది. ఎక్కడ తన పిల్లలు చదువును మర్చిపోతారేమో అనే భయంతో అక్కడే కూర్చోబెట్టుకుంటుంది. ఓ వైపు ద్రాక్ష పండ్లను విక్రయిస్తూనే మధ్య మధ్యలో పిల్లల పక్కన కూర్చుని చదువు నేర్పిస్తోంది. ఎక్కడా విసుక్కోకుండా ఎంతో ప్రేమతో తన పిల్లలకు చదువు నేర్పడం.. అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ ఘటనపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఇది కదా తల్లి ప్రేమ అంటే’’.. అని కొందరు, ‘‘తల్లిని మించిన దైవం లేదు.. అనడానికి ఈ ఘటనే నిదర్శనం’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఆగి ఉన్న విమానం వద్ద సిబ్బంది చేసిన పని చూసి ప్రయాణికుడు షాక్.. వెంటనే వీడియో తీయడంతో చివరికి ఏం జరిగిందంటే..

Updated Date - 2023-08-31T17:54:21+05:30 IST