ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking Video: ఫుల్లు రద్దీగా మెట్రో రైలు.. ఓ మహిళ శరీరం సగం బయటే ఉండగానే మూసుకుపోతున్న డోర్లు.. చివరకు..!

ABN, First Publish Date - 2023-10-04T15:33:30+05:30

రైలు ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో.. కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ ఇబ్బందికరంగా కూడా మారుతుంటుంది. మరికొన్నిసార్లు ఇది ప్రాణాల మీదకు కూడా వస్తుంటుంది. త్వరగా గమ్యస్థానం చేరాలనే తొందరలో చాలా మంది కదులుతున్న రైళ్లను ఎక్కుతూ ప్రమాదాలకు గురవడం చూస్తూనే ఉంటాం. కొందరు...

రైలు ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో.. కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ ఇబ్బందికరంగా కూడా మారుతుంటుంది. మరికొన్నిసార్లు ఇది ప్రాణాల మీదకు కూడా వస్తుంటుంది. త్వరగా గమ్యస్థానం చేరాలనే తొందరలో చాలా మంది కదులుతున్న రైళ్లను ఎక్కుతూ ప్రమాదాలకు గురవడం చూస్తూనే ఉంటాం. కొందరు అదృష్టవశాత్తు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మహిళ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ రద్దీగా ఉన్న రైలును ఎక్కింది. అయితే ఆమె బయట ఉండగానే డోర్లు మూసుకుపోయాయి. చివరకు ఏం జరిగిందంటే...

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. మెట్రో రైలు కదులుతుండగా.. ఓ మహిళ (woman) హడావుడిగా ప్లాట్‌ఫామ్ మీదకు వచ్చింది. బోగీలోకి వెళ్లేందుకు స్థలం లేకున్నా అలాగే ఎక్కేసింది. కనీసం కాలు పెట్టడానికి కూడా స్థలం లేకున్నా డోరు (woman stuck at train door) వద్ద అలాగే నిలబడి ఉంది. రైలు కదలడానికి ముందు డోరు ఆటోమేటిక్‌గా దగ్గరగా వచ్చింది. అయితే మహిళ అడ్డుగా ఉండడంతో డోరు మూసుకుపోయేందుకు వీలు లేకుండా పోయింది. ఈ క్రమంలో డోరు మధ్య ఎక్కడ ఇరుక్కుపోతానో అని మహిళ చాలా భయపడింది. పక్కన Viral Video: వ్యోమగాముల కష్టాలు మరీ ఈ రేంజ్‌లో ఉన్న వాళ్లు ఆమెను లోపలికి నెట్టే ప్రయత్నం చేశారు.

Viral Video: తలపై గ్యాస్ సిలిండర్ పెట్టుకుని.. కింద ఓ చిన్న బిందెను బోర్లించి.. ఈ మహిళ చేసిన రిస్క్ చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..!

అయితే జనం రద్దీగా ఉండడంతో అది సాధ్యం కాలేదు. చివరకు కింద ఉన్న ఓ వ్యక్తి.. ఆమెను ఎలాగోలా లోపలికి నెట్టేయడంతో డోరు మూసుకుపోయింది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! చూస్తుంటేనే భయంగా ఉంది’’.. అని కొందరు, ‘‘ఇంత ఇబ్బంది పడుతూ ప్రయాణించడం అవసరమా’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి సాహసాలు ఎవరూ చేయొద్దు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ మహిళకు.. సడన్‌గా వినిపించిందో శబ్దం.. అరుపులు వినిపించిన వైపు వెళ్లి చూస్తే..!

Updated Date - 2023-10-04T15:33:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising