Viral Video: తలపై గ్యాస్ సిలిండర్ పెట్టుకుని.. కింద ఓ చిన్న బిందెను బోర్లించి.. ఈ మహిళ చేసిన రిస్క్ చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..!

ABN , First Publish Date - 2023-10-03T19:38:59+05:30 IST

అంతా చేయలేని పనులను కొంతమంది మాత్రం చాలా ఈజీగా చేసేస్తుంటారు. ఇంకొందరు వినూత్నమైన సాహసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి విన్యాసాలు చూసినప్పుడు.. వీరికేమైనా మానవాతీత శక్తులేమైనా ఉన్నాయా.. అని అనిపిస్తుంటుంది. ప్రస్తుతం...

Viral Video: తలపై గ్యాస్ సిలిండర్ పెట్టుకుని.. కింద ఓ చిన్న బిందెను బోర్లించి.. ఈ మహిళ చేసిన రిస్క్ చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..!

అంతా చేయలేని పనులను కొంతమంది మాత్రం చాలా ఈజీగా చేసేస్తుంటారు. ఇంకొందరు వినూత్నమైన సాహసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి విన్యాసాలు చూసినప్పుడు.. వీరికేమైనా మానవాతీత శక్తులేమైనా ఉన్నాయా.. అని అనిపిస్తుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి విన్యాసాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మహిళ విన్యాసానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. తలపై గ్యాస్ సిలిండర్ పెట్టుకుని ఆమె చేసి డాన్స్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ మహిళ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇంట్లోని ఖాలీ సిలిండర్‌ను (cylinder) నెత్తి మీద పెట్టుకున్న ఓ మహిళ.. అంతటితో ఆగకుండా డాన్స్ కూడా చేసింది. తలపై సిలిండర్‌ను (woman danced with gas cylinder on her head) బ్యాలెన్స్ చేయడమే కష్టం అనుకుంటే.. ఈమె మాత్రం సిలిండర్‌ను బ్యాలెన్స్ చేస్తూనే ఎదురుగా బోర్లించిన గిన్నె పైకి కూడా ఎక్కుతుంది. తర్వాత రౌండ్లు తిరుగుతూ నాట్యం చేస్తుంది. చివరకు అంత చిన్న బిందెపై ఒంటి కాలిపై నిలబడి నృత్యం చేస్తుంది.

Viral Video: ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ మహిళకు.. సడన్‌గా వినిపించిందో శబ్దం.. అరుపులు వినిపించిన వైపు వెళ్లి చూస్తే..!

అయినా ఎక్కడా బ్యాలెన్స్ కోల్పోకుండా సిలిండర్‌ను తలపై నిలబెడుతుంది. కొంచెం బ్యాలెన్స్ తప్పినా సిలిండర్ మీద పడే ఛాన్స్ ఉంది. కానీ ఆమె ఎంతో చాకచక్యంగా సిలిండర్‌ను తలపై పెట్టుకుని, ఈజీగా డాన్స్ చేసేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఈమె టాలెంట్ అద్భుతం’’.. అని కొందరు, ‘‘ఇలాంటి విన్యాసం.. చేయడం చాలా కష్టం’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటివి ఎవరూ అనుకరించవద్దు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.80లక్షల లైక్‌లను సొంతం చేసుకుంది.

Marriage Video: పెళ్లికి వచ్చిన బంధువులంతా.. ఈ వరుడి వాయిస్ విని షాక్.. పాట పాడుతోంటే వాళ్ల రెస్పాన్స్‌ను మీరే చూడండి..!

Updated Date - 2023-10-03T19:38:59+05:30 IST