ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఖరీదైన హోటల్ కదా అని స్నేహితులతో కలిసి హుందాగా వెళ్లిన యువకుడు.. చివరికి కుర్చీ పక్కన చూసుకుని ఖంగుతిన్నాడు..

ABN, First Publish Date - 2023-05-14T19:28:51+05:30

అదో ఖరీదైన హోటల్ కావడంతో ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి హుందాగా వెళ్లాడు. అంతా కలిసి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కాసేపటి తర్వాత ఊహించని ఘటన చోటు చేసుకుంది. అప్పటిదాకా సంతోషంగా ఉన్న యువకుడు.. తర్వాత..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదో ఖరీదైన హోటల్ కావడంతో ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి హుందాగా వెళ్లాడు. అంతా కలిసి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కాసేపటి తర్వాత ఊహించని ఘటన చోటు చేసుకుంది. అప్పటిదాకా సంతోషంగా ఉన్న యువకుడు.. తర్వాత తన కుర్చీ పక్కన చూసుకుని షాక్ అయ్యాడు. చివరకు హోటల్ యాజమాన్యం కలుగజేసుకుని సీసీ కెమెరాలు పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇండోనేషియా (Indonesia) దక్షిణ జకార్తాలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు (young man) తన స్నేహితులతో కలిసి స్థానికంగా ఉన్న ఓ ఖరీదైన హోటల్‌కి (Expensive hotel) వెళ్తాడు. అతా ఓ టేబుల్ బుక్ చేసుకుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగా సప్లయర్లు వారు ఆర్డర్ చేసిన ఫుడ్ తీసుకుని వస్తారు. స్నేహితులంతా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ.. మాట్లాడుకుంటూ ఉంటారు. వారిలో చివరగా కూర్చున్న యువకుడు.. తన బ్యాగును కుర్చీ పక్కన పెట్టుకుని ఉంటాడు. అయితే అదే సమయంలో ఓ వ్యక్తి.. యువకుడి పక్కన నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అతను హుందాగా ఉండడంతో అక్కడున్న వారికి ఎలాంటి అనుమానమూ రాదు.

Viral Video: ఈ ఆవు నిజంగా గోమాతే.. పిల్లాడి వద్దకు వచ్చి ఏం చేసిందో చూడండి..

నిలబడి ఉన్న వ్యక్తి.. ఫోన్ మాట్లాడుకుంటూనే బ్యాగును కొంచెం కొంచెం కాలితో పక్కకు జరిపేస్తాడు. అలా బ్యాగును జరపగానే అక్కడే నిలబడి ఉన్న మరో వ్యక్తి దాన్ని తీసుకుని తాపీగా (thugs stole the bag) బయటికి వెళ్లిపోతాడు. తర్వాత ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి కూడా వెళ్లిపోతాడు. చివరగా కుర్చీ పక్కన చూసుకుని బ్యాగు కనిపించకపోవడంతో యువకుడు షాక్ అవుతాడు. చుట్టు పక్కల వెతికినా ఎక్కడా కనిపించకపోవడంతో చివరకు హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తాడు. సీసీ కెమెరా ఫుటేజీని (CCTV footage) పరిశీలించడంతో అసలు విషయం తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, ఈ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Viral video) వైరల్‌గా మారింది.

Viral Video: నిద్రపోతున్న తల్లి పక్కన.. దుప్పటి కప్పుకొని ఏదో చెయ్యాలనుకుంది.. చివరికి ఏమైందో మీరే చూడండి..

Updated Date - 2023-05-14T19:28:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising