Viral Video: ఈ ఆవు నిజంగా గోమాతే.. పిల్లాడి వద్దకు వచ్చి ఏం చేసిందో చూడండి..

ABN , First Publish Date - 2023-05-13T18:33:48+05:30 IST

హిందువులు ఆవులను గోమాతలుగా పూజిస్తారు. ఆవుల్లో సకల దేవతలను ఉంటారని నమ్ముతారు. అందుకే ఎంతో మంది వాటికి ప్రదక్షిణలు కూడా చేస్తుంటారు. ఇక పల్లెల్లో అయితే చాలా మంది కుక్కలు, గేదెలు, ఎద్దులతో పాటూ ఆవులను కూడా పెంచుకోవడం సర్వసాధారణమైంది. ఈ క్రమంలో..

Viral Video: ఈ ఆవు నిజంగా గోమాతే.. పిల్లాడి వద్దకు వచ్చి ఏం చేసిందో చూడండి..

హిందువులు ఆవులను గోమాతలుగా పూజిస్తారు. ఆవుల్లో సకల దేవతలను ఉంటారని నమ్ముతారు. అందుకే ఎంతో మంది వాటికి ప్రదక్షిణలు కూడా చేస్తుంటారు. ఇక పల్లెల్లో అయితే చాలా మంది కుక్కలు, గేదెలు, ఎద్దులతో పాటూ ఆవులను కూడా పెంచుకోవడం సర్వసాధారణమైంది. ఈ క్రమంలో ఆ కుటుంబ సభ్యుల పట్ల పెంపుడు జంతువులు కూడా ఎంతో ప్రేమను కనబరుస్తుంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ ఆవుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పిల్లాడిని ఆవు లాలించిన విధానాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీంతో ఈ వీడియోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

సోషల్ మీడియాలో చిన్నారి, ఆవు వీడియో తెగ చక్కర్లు (Viral Videos) కొడుతోంది. ఓ ఇంటి ఆవరణలో ఆవుల మంద మేత మేస్తూ ఉంటుంది. వాటికి సమీపంలో ఓ మంచంపై నెలల వయసున్న చిన్నారి (child) ఆడుకుంటూ ఉంటుంది. చిన్నారి ఒక్కటే ఉండడాన్ని గమనించిన ఓ ఆవు (cow) .. ఎక్కడ కిందపడతాడో అనుకుందో ఏమోగానీ.. వెంటనే మంచం వద్దకు వస్తుంది. చిన్నారిని ప్రేమగా (cow showing affection towards a child) ముద్దాడుతూ తన అభిమానాన్ని వ్యక్తం చేస్తుంది. చిన్నారి కూడా ఆవు తలను పట్టుకుని ముద్దాడతాడు. చిన్నారికి రక్షణగా ఆవు చాలా సేపు అక్కడే ఉండి లాలిస్తూ ఉంటుంది.

Viral Video: గొడవ పడుతున్న యువతులను విడిపించకుండా.. సింపుల్ ట్రిక్‌తో పోలీసులు ఎలా కంట్రోల్ చేశారో చూడండి..

లేగదూడ పట్ల ఎలాంటి ప్రేమ చూపిస్తుందో.. అచ్చం అలానే చిన్నారిని చూసుకోవడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘అందుకే ఆవును గోమాత అనేది’’.. అని కొందరు, ‘‘ఆహా! చూడముచ్చటైన సన్నివేశం’’.. అని మరికొందరు, ‘‘గోమాతలను రక్షించుకోవాలి’’.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో లైకులను సొంతం చేసుకుంది.

Crime News: బెడ్‌రూంలో పాటల సౌండ్ ఒక్కసారిగా పెరగడంతో భార్యకు అనుమానం.. కాసేపటి తర్వాత లోపలికి వెళ్లి చూడగా.. భర్త చేసిన నిర్వాకం..

Updated Date - 2023-05-13T18:33:48+05:30 IST