Viral Video: గొడవ పడుతున్న యువతులను విడిపించకుండా.. సింపుల్ ట్రిక్‌తో పోలీసులు ఎలా కంట్రోల్ చేశారో చూడండి..

ABN , First Publish Date - 2023-05-13T15:51:57+05:30 IST

కొన్ని కేసులు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారుతుంటాయి. అలాగే కొన్ని కొన్ని గొడవలను కంట్రోల్ చేయడానికి కూడా నానాతంటాలు పడుతుంటారు. ఇక మహిళల మధ్య తలెత్తే గొడవలను పరిష్కరించడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే..

Viral Video: గొడవ పడుతున్న యువతులను విడిపించకుండా.. సింపుల్ ట్రిక్‌తో పోలీసులు ఎలా కంట్రోల్ చేశారో చూడండి..

కొన్ని కేసులు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారుతుంటాయి. అలాగే కొన్ని కొన్ని గొడవలను కంట్రోల్ చేయడానికి కూడా నానాతంటాలు పడుతుంటారు. ఇక మహిళల మధ్య తలెత్తే గొడవలను పరిష్కరించడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పోలీసులు మాత్రం.. యువతుల మధ్య తలెత్తిన గొడవను సింపుల్ ట్రిక్‌తో పరిష్కరించారు. వారు చేసిన చిన్న పనితో అప్పటిదాకా కొట్టుకుంటున్న యువతులు.. ఒక్కసారిగా పరుగందుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయం ఖచ్చితంగా తెలియకున్నా.. మిస్సౌరీలోని (Missouri) కాన్సాస్‌ సిటీలో జరిగినట్లుగా చెబుతున్నారు. కారణం ఏంటో తెలీదుగానీ రద్దీగా ఉన్న దుకాణాల ఎదుట కొందరు యువతుల మధ్య ఉన్నట్టుండి గొడవ (Quarrel between young women) మొదలవుతుంది. కోపంతో ఊగిపోతూ ఒకరినొకరు జుట్టు పట్టుకుని కొట్టుకుంటూ, కాళ్లతో తన్నుకుంటూ గొడవపడుతుంటారు. వీరి గొడవ చూసి చుట్టు పక్కల వారు కూడా భయంతో పక్కకు వెళ్లిపోతారు. ఎవరూ విడిపించే ప్రయత్నం చేయరు. అయితే ఈ గొడవ గురించి తెలుసుకున్న పోలీసు అక్కడికి వస్తాడు. వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా జస్ట్ చిన్న పనితో గొడవను కంట్రోల్ చేస్తాడు. దాడి చేసుకుుంటున్న యువతుల వద్దకు వచ్చిన పోలీసు.. వారిపై ఇలా పెప్పర్ స్ప్రే (Pepper spray) చల్లి, అలా అక్కడి నుంచి కామ్‌గా వెళ్లిపోతాడు.

Viral Video: బైకులో వెళ్తున్న ప్రేమికులకు.. సడన్ షాక్ ఇచ్చిన స్నేహితులు.. బండిని ఫాలో అవుతూ చివరకు వీరు చేసిన పని..

పెప్పర్ స్ప్రే కళ్లల్లో పడడంతో.. దెబ్బకు యువతులంతా కొట్టుకోవడం మానేసి, కళ్లు రుద్దుకుంటూ అక్కడి నుంచి పారిపోతారు. అయితే అంతలో సమీపంలో మరికొందరు యువతులు గొడవ పడుతుంటారు. దీంతో వారి వద్దకు వెళ్లిన పోలీసులు యథావిధిగా పెప్పర్ స్ప్రే చల్లి.. పని అయిపోంది అన్నట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కళ్లు మంట పుట్టడంతో యువతులంతా.. రుద్దుకుంటూ, దగ్గుకుంటూ అక్కడి నుంచి పారిపోతారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Viral video) తెగ వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ‘‘అరె! గొడవలను ఎంత సింపుల్‌గా పరిష్కరించారు’’.. అని కొందరు, ‘‘ఈ పోలీసులు ఐడియా సూపర్’’.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Crime News: బెడ్‌రూంలో పాటల సౌండ్ ఒక్కసారిగా పెరగడంతో భార్యకు అనుమానం.. కాసేపటి తర్వాత లోపలికి వెళ్లి చూడగా.. భర్త చేసిన నిర్వాకం..

Updated Date - 2023-05-13T15:51:57+05:30 IST