Viral Video: మొసలితో యువతి చెట్టాపట్టాల్.. ఇద్దరూ ఈతకొడుతూ.. ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూస్తే..

ABN , First Publish Date - 2023-05-12T17:08:50+05:30 IST

మొసలి ఎంత భయంకరమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాటి సమీపానికి వెళ్లి తప్పించుకుని రావాలంటే సాధ్యమయ్యే పని కాదు. మొసళ్లు ఒకసారి టార్గెట్ చేశాయంటే.. ఎవరైనా వాటికి ఆహారమవ్వాల్సిందే. అయితే అలాంటి భయంకరమైన మొసళ్లు కూడా కొన్నిసార్లు..

Viral Video: మొసలితో యువతి చెట్టాపట్టాల్.. ఇద్దరూ ఈతకొడుతూ.. ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూస్తే..

మొసలి ఎంత భయంకరమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాటి సమీపానికి వెళ్లి తప్పించుకుని రావాలంటే సాధ్యమయ్యే పని కాదు. మొసళ్లు ఒకసారి టార్గెట్ చేశాయంటే.. ఎవరైనా వాటికి ఆహారమవ్వాల్సిందే. అయితే అలాంటి భయంకరమైన మొసళ్లు కూడా కొన్నిసార్లు విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి విచిత్రమైన మొసలికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి భారీ మొసలితో స్నేహంగా ఉండడమే కాకుండా... దాంతో కలిసి ఈత కొట్టడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral videos) తెగ చక్కర్లు కొడుతోంది. బికినీ ధరించిన ఓ యువతి (Young woman in bikini dress) అందరికీ షాక్ ఇస్తోంది. ఈ యువతి సముంద్రంలో ఈత కొట్టడం చూసి అంతా అవాక్కవుతున్నారు. అందరిలా ఈత కొడితే విశేషం ఉండదు గానీ.. విచిత్రంగా భారీ మొసలితో కలిసి ఈత కొట్టడం (young woman swimming with crocodile) అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈత కొడుతూ నీటి అడుగుకు వెళ్లిన యువతి.. నీటిపై పాకుతున్న మొసలి వద్దకు వెళ్తుంది. వెళ్లడమే కాకుండా దగ్గరికి రెండు చేతులతో మొసలిని ప్రేమగా నిమురుతుంది.

Viral News: పొరిగింటి వారిని ఖాళీ చేయించేందుకు మహిళ ప్లాన్.. రోజూ రాత్రిళ్లు ఎవరికీ తెలీకుండా ఆమె చేసిన పని.. చివరకు..

అయినా ఆమె మొఖంలో ఏమాత్రం భయం కనిపించిందు. అలాగే మొసలి కూడా ఆమెను ఏమీ అనకపోవడం ఆశ్చర్యం. ఇలా ఇద్దరూ కలిసి చాలా సేపు ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు (Shocking comments) చేస్తున్నారు. ‘‘వామ్మో! ఇది మేము నమ్మలేకున్నాం’’.. అని కొందరు, ‘‘ఇది చాలా మంచి మొసలి అయ్యుంటుంది’’.. అని మరికొందరు, ‘‘ఈ యువతికి ఎంత ధైర్యం’’.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో లక్షల్లో లైకులను సొంతం చేసుకుంది.

Viral Video: బైకులో వెళ్తున్న ప్రేమికులకు.. సడన్ షాక్ ఇచ్చిన స్నేహితులు.. బండిని ఫాలో అవుతూ చివరకు వీరు చేసిన పని..

Updated Date - 2023-05-12T17:08:50+05:30 IST