Viral Video: వచ్చిన కాసేపటి తర్వాత ఫోన్ మాట్లాడుతూ వెళ్లిపోయాడు.. మధ్యలో ఇతడి తెలివితేటలు చూస్తే.. అవాక్కవుతారు..

ABN , First Publish Date - 2023-05-13T17:32:02+05:30 IST

కొందరు పైకి హుందాగా కనిపించినా.. వారు చేసే పనులు చూస్తే చాలా నీచంగా ఉంటాయి. అలాగే కొందరు కక్కుర్తితో చేసే పనులు కొన్నిసార్లు కోపం తెపిస్తే.. మరికొన్ని సార్లు నవ్వు తెప్పిస్తుంటాయి. ఇంకొందరు చోరీలకు పాల్పడే సమయంలో అతి తెలివితేటలు ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి..

Viral Video: వచ్చిన కాసేపటి తర్వాత ఫోన్ మాట్లాడుతూ వెళ్లిపోయాడు.. మధ్యలో ఇతడి తెలివితేటలు చూస్తే.. అవాక్కవుతారు..

కొందరు పైకి హుందాగా కనిపించినా.. వారు చేసే పనులు చూస్తే చాలా నీచంగా ఉంటాయి. అలాగే కొందరు కక్కుర్తితో చేసే పనులు కొన్నిసార్లు కోపం తెపిస్తే.. మరికొన్ని సార్లు నవ్వు తెప్పిస్తుంటాయి. ఇంకొందరు చోరీలకు పాల్పడే సమయంలో అతి తెలివితేటలు ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఫోన్ మాట్లాడుతూ వచ్చిన వ్యక్తి.. వచ్చిన కాసేపటికే వెళ్లిపోయాడు. అయితే మధ్యలో అతడు చేసిన పని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral Videos) అవుతోంది. ఓ యువకుడు (young man) ఫోన్ మాట్లాడుకుంటూ నిర్మానుష్య ప్రదేశానికి వచ్చి మెట్లపై కూర్చుంటాడు. కూర్చున్న కొద్దిసేపటికి తెలివితేటలు ప్రదర్శిస్తాడు. అతడి పాత చెప్పులను పక్కన పెట్టి.. పక్కనే ఉన్న బూట్లపై కన్నేస్తాడు. వాటిని ఎంతో చాకచక్యంగా తీసుకుని, అంతే తెలివిగా వాటిని కాళ్ల మధ్యలో పెట్టుకుంటాడు. తర్వాత తాపీగా పైకి లేచి ఫోన్ మాట్లాడుతూనే.. పాత చెప్పులకు బదులుగా (Theft of shoes) బూట్లను వేసుకుంటాడు.

Viral Video: గొడవ పడుతున్న యువతులను విడిపించకుండా.. సింపుల్ ట్రిక్‌తో పోలీసులు ఎలా కంట్రోల్ చేశారో చూడండి..

వెంటనే ఏమీ తెలియని వాడిలా అక్కడి నుంచి మెల్లిగా జారుకుంటాడు. చోరీ చేయడంలో కూడా హుందాతనం చూపిస్తూ.. బూట్లను ఎత్తుకెళ్లడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతనో హైటెక్ దొంగ’’.. అంటూ కొందరు, ‘‘ఆహా! ఇతడి తెలివితేటలు అద్భుతం’’.. అంటూ మరికొందరు, ‘‘పాపం ఎన్ని కష్టాల్లో ఉన్నాడో ఏమో’’.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

Crime News: బెడ్‌రూంలో పాటల సౌండ్ ఒక్కసారిగా పెరగడంతో భార్యకు అనుమానం.. కాసేపటి తర్వాత లోపలికి వెళ్లి చూడగా.. భర్త చేసిన నిర్వాకం..

Updated Date - 2023-05-13T17:32:02+05:30 IST