ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: నూడుల్స్ తిందామని స్పూన్‌తో పైకి ఎత్తగానే.. ఒక్కసారిగా ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

ABN, First Publish Date - 2023-01-08T16:00:20+05:30

అసలే ఇది చలికాలం.. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటికి రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఇలాంటి సమయాల్లో చలిమంటలు వేసుకోవడంతో పాటూ వేడి వేడి వంటకాలు తినేందుకు జనం ఇష్టపడుతుంటారు. ఇళ్లల్లోనూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అసలే ఇది చలికాలం.. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటికి రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఇలాంటి సమయాల్లో చలిమంటలు వేసుకోవడంతో పాటూ వేడి వేడి వంటకాలు తినేందుకు జనం ఇష్టపడుతుంటారు. ఇళ్లల్లోనూ ఆహార పదార్థాలు వేడి వేడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. మన పరిస్థితే ఇలా ఉంటే.. ఇక నిత్యం గడ్డ కట్టే చలి ప్రాంతాల్లో నివసించే ప్రజల పరిస్థితి ఇంకెలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. గడ్డ కట్టుకుపోయిన ఓ వ్యక్తి నూడుల్స్ తింటున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ (Viral videos) అవుతోంది. నూడుల్స్‌ని తిందామని స్పూన్‌తో పైకి ఎత్తాడు. దీంతో ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు.. భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీగా ఉండడంతో.. ఇంటికి వెళ్లి చూసేసరికి..

గడ్డ కట్టే చలిలో.. అది కూడా -60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు (-60 degrees Celsius Temperature) ఉన్న ప్రాంతంలో.. వేడి వేడి నూడుల్స్ (Noodles) తింటే ఏమవుందో చూపించేందుకు ఓ ప్రయోగం చేశాడు. ముందుగా అతను చలికి తట్టుకునేలా మందపాటి కోటు ధరించి, చేతిలో వేడి వేడి నూడుల్స్ బౌల్‌ను పట్టుకుని ఇంటి బయటికి వస్తాడు. వచ్చిన కాసేపటికే అతడి జుట్టు, కనురెప్పలతో సహా గడ్డ కట్టి ఉంటాయి. కాసేపటి తర్వాత నూడుల్స్ తినేందుకు స్పూన్‌తో వాటిని కాస్త పైకి ఎత్తి పట్టుకుంటాడు. కొన్ని క్షణాల తర్వాత స్పూన్‌ను వదిలేస్తాడు. ఆశ్చర్యకరంగా స్పూన్‌తో సహా నూడుల్స్ మొత్తం అలాగే స్తంభించిపోతాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. వామ్మో! ఇదేంట్రా నాయనా అంటూ కొందరు, అలాగే అక్కడే ఉంటే మీ పరిస్థితి ఇలాగే అవ్వొచ్చు.. అని ఇంకొందరు, త్వరగా మీ శరీరాన్ని వేడెక్కించుకోండి.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌ను (Millions of views) సొంతం చేసుకుంది.

Viral Video: ఇతడి తెలివిని చూసి ఆనంద్ మహీంద్రాయే అవాక్కయ్యారు.. రూపాయి ఖర్చు లేకుండా..

Updated Date - 2023-01-08T16:04:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising