Viral Video: ఇతడి తెలివిని చూసి ఆనంద్ మహీంద్రాయే అవాక్కయ్యారు.. రూపాయి ఖర్చు లేకుండా..

ABN , First Publish Date - 2023-01-07T15:28:30+05:30 IST

ప్రస్తుత యువత ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా రోజూ జిమ్‌లలో వివిధ రకాలుగా కసరత్తులు చేస్తుంటారు. ధనవంతులైతే తమ ఇళ్లల్లోనే జిమ్ పరికాలను ఏర్పాటు చేసుకోవడం సర్వసాధారణమైంది. కొందరైతే..

Viral Video: ఇతడి తెలివిని చూసి ఆనంద్ మహీంద్రాయే అవాక్కయ్యారు.. రూపాయి ఖర్చు లేకుండా..

ప్రస్తుత యువత ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా రోజూ జిమ్‌లలో వివిధ రకాలుగా కసరత్తులు చేస్తుంటారు. ధనవంతులైతే తమ ఇళ్లల్లోనే జిమ్ పరికాలను ఏర్పాటు చేసుకోవడం సర్వసాధారణమైంది. కొందరైతే అంత ఖర్చు చేయలేక.. అందుబాటులో ఉన్న వస్తువులతోనే కసరత్తులు చేసేస్తుంటారు. ఇంకొందరి తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇందుకు సబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. రూపాయి ఖర్చు లేకుండా ఓ యువకుడు తన ఇంట్లోనే ట్రెడ్‌మిల్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇతడి తెలివిచూసి.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాకు తెగ ముచ్చటేసింది. వెంటనే ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

Viral Video: ఆలయంలో వ్యక్తి చేసిన నిర్వాకం.. మహిళను ఈడ్చుకెళ్లి మరీ.. కారణం ఏంటని అడిగితే..

ట్రెడ్‌మిల్ మీద నడిచినట్లుగా ఓ యువకుడు చేసిన ప్రయోగం చూసి.. ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఫిదా అయ్యారు. ఇది ప్రపంచంలోనే అత్యంత చౌకైన ట్రెడ్‌మిల్ (treadmill) అని వ్యాఖ్యానిస్తూ వీడియోను షేర్ చేశారు. ఇందులో ఓ యువకుడు వంట గదిలో ముందుగా నూనే బాటిల్ తీసుకుని, కొంత నూనెను కింద పోస్తాడు. తర్వాత దానిపై కొన్ని నీళ్లను పోస్తాడు. అనంతరం కాలితో చదును చేసి, తర్వాత దానిపై నడుస్తాడు. నూనె వేయడంతో సాధారణంగానే జారుతుంది కాబట్టి.. దానిపై అతను ట్రెడ్‌మిల్ తరహాలో నడక సాగిస్తాడు. అంతటితో ఆగకుండా బటన్ నొక్కి, వేగం పెంచినట్లుగా నటిస్తూ వేగంగా పరుగెడతాడు. ఇదంతా చూడటానికి.. అచ్చం ట్రెడ్‌మిల్ మీద చేసినట్లుగానే ఉంటుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు (Viral videos) కొడుతోంది. ఈ ఏడాది ఇన్నోవేషన్ అవార్డు ట్రోఫీని ఇతడికే ఇవ్వాలి అని.. ఆనంద్ మహింద్రా వ్యాఖ్యానించారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Whatsapp video: సహోద్యోగి భార్యతో అసభ్యకరంగా ఉన్న వీడియోను షేర్ చేసిన కానిస్టేబుల్.. ఒకేసారి వంద మంది చూస్తుండగా..

Updated Date - 2023-01-07T15:28:36+05:30 IST