ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: సింహంతో యువతి చెలగాటం.. ప్రేమగా తాకాలని చూడగానే.. పక్కన ఉన్న సింహం ఏం చేసిందంటే..

ABN, First Publish Date - 2023-06-04T20:04:30+05:30

క్రూర మృగాలు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. సైలెంట్‌గా ఉన్నాయి కదా అని చెలగాటం ఆడాలని చూస్తే.. చివరికి వాటికి ఆహారం అవ్వాల్సి వస్తుంది. జూలలో ఎన్‌క్లోజర్‌లో ఉన్న పులులు, సింహాలను కావాలని ఇబ్బంది పెట్టి.. చివరకు వాటి దాడికి గురైన చాలా మందిని గతంలో చూశాం. అదేవిధంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రూర మృగాలు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. సైలెంట్‌గా ఉన్నాయి కదా అని చెలగాటం ఆడాలని చూస్తే.. చివరికి వాటికి ఆహారం అవ్వాల్సి వస్తుంది. జూలలో ఎన్‌క్లోజర్‌లో ఉన్న పులులు, సింహాలను కావాలని ఇబ్బంది పెట్టి.. చివరకు వాటి దాడికి గురైన చాలా మందిని గతంలో చూశాం. అదేవిధంగా ట్రైనింగ్ ఇచ్చిన పులులు, సింహాలు కూడా చాలా సార్లు కేర్ టేకర్ల పైనే దాడి చేసిన సందర్భాలను కూడా చూశాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ యువతికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి సింహంతో చెలగాటం ఆడాలని చూసింది. దగ్గరికి వచ్చి ప్రేమగా తాకగానే పక్కన ఉన్న సింహానికి చిర్రెత్తుకొచ్చింది. చివరకు ఏం చేసిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ జూలో రెండు సింహాలు (lions) చెట్టు కింద పడుకుని సేద తీరుతూ ఉంటాయి. వాటిని చూసేందుకు వచ్చిన ఓ యువతి (young woman) .. ముందుగా దూరంగా నిలబడి గమనిస్తుంది. సింహాలు కామ్‌గా పడుకుని ఉండడంతో ధైర్యం తెచ్చుకుని మెల్లగా దగ్గరికి వెళ్లింది. ఓ సింహం వద్ద కూర్చుని ప్రేమగా చేయి వేసి నిమురుతుంది. అయినా ఆ సింహం మాత్రం ఏమీ అనకుండా అలాగే పడుకుని ఉంటుంది. అయితే అప్పటికే భయంతో ఉన్న యువతి.. తాకిన వెంటనే అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తుంది.

Viral Video: వద్దు వద్దు అని వధువు అంటున్నా వినిపించుకోని వ్యక్తి.. చివరకు అందరి ముందూ ఏం చేశాడో మీరే చూడండి..

యువతి పారిపోవడం చూసి.. పక్కన ఉన్న సింహం ఆమెను (lion chasing a young woman) వెంబడిస్తుంది. దీంతో సదరు యువతి.. ‘‘వామ్మో! చచ్చాన్రో.. దేవుడో’’.. అనుకుంటూ మరింత వేగంగా పరుగులు పెడుతుంది. ఈ వీడియో అంతటితో ముగుస్తుంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు. ‘‘ఇంతకీ ఆ యువతి క్షేమంగా ఉందా’’.. అని కొందరు, ‘‘ఇలాంటి సాహసాలు చేయొద్దు’’.. అని మరికొందరు, ‘‘ఆమెకు ఏమీ కాకూడదని కోరుకుంటున్నాం’’.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలావుండగా, సింహాల పక్కనే కేర్ టేకర్ ఉన్నాడని, ఆమెకు ఏమీ కాలేదని తెలిసింది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో చోటు చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Viral News: వామ్మో.. ఈ యువతి టాలెంట్ మామూలుగా లేదుగా.. ఇన్‌స్టా అకౌంట్‌ను ఓపెన్ చేసి అనుకున్నది సాధించేసింది..!

Updated Date - 2023-06-04T20:04:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising