Viral Video: వద్దు వద్దు అని వధువు అంటున్నా వినిపించుకోని వ్యక్తి.. చివరకు అందరి ముందూ ఏం చేశాడో మీరే చూడండి..

ABN , First Publish Date - 2023-06-04T18:31:15+05:30 IST

పెళ్లిళ్ల సమయాల్లో కొన్నిసార్లు హాస్యభరితమైన ఘటనలు చోటు చేసుకుంటే.. మరికొన్నిసార్లు విషాద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అలాగే ఇంకొన్నిసార్లు భావోద్వేగభరితమైన ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి.. వివాహ కార్యక్రమాల్లో

Viral Video: వద్దు వద్దు అని వధువు అంటున్నా వినిపించుకోని వ్యక్తి.. చివరకు అందరి ముందూ ఏం చేశాడో మీరే చూడండి..

పెళ్లిళ్ల సమయాల్లో కొన్నిసార్లు హాస్యభరితమైన ఘటనలు చోటు చేసుకుంటే.. మరికొన్నిసార్లు విషాద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అలాగే ఇంకొన్నిసార్లు భావోద్వేగభరితమైన ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి.. వివాహ కార్యక్రమాల్లో చోటు చేసుకునే చిన్న చిన్న ఘటనలు కూడా తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ వివాహానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వధువు వద్దు.. వద్దు.. అంటున్నా వినిపించుకోకుండా ఓ వ్యక్తి ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి కారు ఎక్కించాడు. కిడ్నాప్ చేస్తున్నారేమో అని అంతా అనుకున్నారు. కానీ విచారించగా చివరకు ఏం తెలిసిందంటే...

సోషల్ మీడియాలో ఓ వధువుకు సంబంధించిన వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. వివాహ వేడుకలో (wedding ceremony) ఈ ఘటన చోటు చేసుకుంది. అతిథులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వధువు మెడలో వరుడు తాళి కట్టాడు. అంతా అంక్షింతలు వేసి ఆశీర్వదించారు. అంతవరకూ సంతోషంగా ఉన్న వధువు (bride) .. వీడ్కోలు సమయం రాగానే ఒక్కసారిగా మారిపోయింది. తల్లిదండ్రులను వదిలి వెళ్లలేక తల్లడిల్లిపోయింది. పుట్టింటి మీద ఎంత ప్రేమ ఉన్నా.. మెట్టినింటికి వెళ్లాలి కదా.. అని కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఎంత సేపు చూసినా వధువు వినకపోవడంతో ఓ వ్యక్తి ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి కారులో కూర్చోబెట్టాడు.

Viral Video: కొంపదీసి ఆమె భర్త విడాకులు ఇస్తాడా ఏంటి..?.. పెళ్లి వేడుకలో ఈ మహిళ డాన్స్ చూసి నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..!

ఆ సమయంలో వధువు ‘‘ ఓ మమ్మీ.. ఓ మమ్మీ.. నన్ను తీసుకెళ్లు’’.. అంటూ ఏడుస్తూనే ఉంది. వద్దు వద్దు నన్ను వదలండి అని అంటున్న సదరు వ్యక్తి వినిపించుకోకుండా ఆమెను ఎత్తుకెళ్లాడు. అక్కడే ఉన్న కొత్తవారికి మొదట ఏమీ అర్థం కాలేదు. ఎవరైనా బలవంతంగా తీసుకెళ్తున్నారేమో అని అనుకున్నారు. చివరకు విషయం తెలుసుకుని ‘‘అయ్యో పాపం! ఈ యువతికి తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ ఉంది’’.. అని ఆమెపై సానుభూతి చూపించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు.

Viral News: వామ్మో.. ఈ యువతి టాలెంట్ మామూలుగా లేదుగా.. ఇన్‌స్టా అకౌంట్‌ను ఓపెన్ చేసి అనుకున్నది సాధించేసింది..!

Updated Date - 2023-06-04T18:31:15+05:30 IST