Viral News: బీచ్‌లో ఓ యువతికి దూరంగా కనిపించిందో వింత ఆకారం.. అనుమానంగానే దగ్గరకు వెళ్లి చూసి షాక్.. అదేంటో తెలిసి..!

ABN , First Publish Date - 2023-06-04T16:01:02+05:30 IST

తవ్వకాలు చేపట్టే సమయంలో కొన్నిసార్లు వెండి, బంగారు నాణేలు బయటపడితే.. మరికొన్నిసార్లు వింత వింత వస్తువులు బయటపడుతుంటాయి. తీరా ఆరా తీస్తే.. వాటి వెనుక పెద్ద చరిత్రే ఉంటుంది. ఇంకొన్నిసార్లు ఎలాంటి తవ్వకాలు చేపట్టకున్నా కూడా.. పాడుబడ్డ ఇళ్లు, ఆలయాలు తదితర ప్రదేశాల్లోనూ..

Viral News: బీచ్‌లో ఓ యువతికి దూరంగా కనిపించిందో వింత ఆకారం.. అనుమానంగానే దగ్గరకు వెళ్లి చూసి షాక్.. అదేంటో తెలిసి..!

తవ్వకాలు చేపట్టే సమయంలో కొన్నిసార్లు వెండి, బంగారు నాణేలు బయటపడితే.. మరికొన్నిసార్లు వింత వింత వస్తువులు బయటపడుతుంటాయి. తీరా ఆరా తీస్తే.. వాటి వెనుక పెద్ద చరిత్రే ఉంటుంది. ఇంకొన్నిసార్లు ఎలాంటి తవ్వకాలు చేపట్టకున్నా కూడా.. పాడుబడ్డ ఇళ్లు, ఆలయాలు తదితర ప్రదేశాల్లోనూ అనేక రకాల వస్తువులు బయటపడుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం ఇలాంటి ఫొటో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి బీచ్‌లో వెళ్తుండగా.. దూరంగా ఏదో వింత ఆకారం కనిపించింది. ఏంటో కనుక్కుందామని దగ్గరికి వెళ్లి చూసి చివరకు షాక్ అయింది..

కాలిఫోర్నియా (California) సెంట్రల్ కోస్ట్‌లోని శాంటా క్రూజ్ కౌంటీలోని మాంటెరీ బేకు సమీపంలోని రియో ​​డెల్ మార్ స్టేట్ బీచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. జెన్నిఫర్ షుహ్ అనే యువతి (Young woman) శుక్రవారం బీచ్‌లో నడుస్తూ వెళ్తుండగా.. దూరంగా ఏదో ఆకారం కనిపించింది. విచిత్రంగా అనిపించడంతో ఏంటా.. అని అనుమానంగానే చూడటానికి వెళ్లింది. తీరా చూస్తే.. అడుగు పొడవు ఉన్న పెద్ద దంతం కనిపించింది. కాలిపోయినట్లుగా కనిపిస్తున్న దంతాన్ని చూసి ఆమె ఆశ్చర్యానికి గురైంది. ఆ దంతం మనిషిదా, లేక జంతువుదా.. అనేది అర్థం కాక చివరకు ఫొటో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ దంతం గురించి తెలిస్తే.. నాకు తెలియజేయండి అని కోరింది.

Viral News: వామ్మో.. ఈ యువతి టాలెంట్ మామూలుగా లేదుగా.. ఇన్‌స్టా అకౌంట్‌ను ఓపెన్ చేసి అనుకున్నది సాధించేసింది..!

women-photos.jpg

చివరకు శాంటాక్రజ్ మ్యూజియంకు (Museum) చెందిన వేన్ థాంప్సన్ అనే వ్యక్తి నుంచి సమాధానం వచ్చింది. సదరు దంతం.. మాస్టోడాన్ (mastodon tooth) అనే అంతరించిపోయిన ఏనుగు వంటి జాతికి చెందినది పేర్కొన్నాడు. చివరకు దాని కోసం బీచ్‌కు వెళ్లగా కనిపించలేదు. దంతం గురించి సమాచారం తెలిస్తే తమ మ్యూజియానికి ఫోన్ చేయాలని థాంప్సన్ సూచించాడు. ఎట్టకేలకు స్మిత్ అనే వ్యక్తి దంతాన్ని తీసుకొచ్చి మ్యూజియంకు విరాళంగా ఇచ్చాడు. ప్రస్తుతం ఆ దంతాన్ని శుక్రవారం నుంచి ఆదివారం వరకు ప్రదర్శనగా ఉంచుతున్నారు. సుమారు 10,000సంవత్సరాల క్రితం మాస్టోడాన్లు భూమి మీద తిరిగేవని తెలిపారు. కాగా, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: కొంపదీసి ఆమె భర్త విడాకులు ఇస్తాడా ఏంటి..?.. పెళ్లి వేడుకలో ఈ మహిళ డాన్స్ చూసి నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..!

Updated Date - 2023-06-04T16:01:02+05:30 IST