Viral News: ఆఫీసులో ఒకటికి రెండుసార్లు బాత్రూంకు వెళ్తే మాత్రం జాబ్‌లోంచి తీసేయడమేంటంటూ కోర్టుకెళ్లాడో ఉద్యోగి.. తీరా చూస్తే..!

ABN , First Publish Date - 2023-06-03T21:14:55+05:30 IST

కొందరు బయటికి చెప్పుకోలేని అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఈ క్రమంలో చివరకు మరిన్ని సమస్యలు కొనితెచ్చుకుని అవస్థలు పడాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తికి కూడా ఇలాంటి అనుభమే ఎదురైంది. ఆఫీసు పని వేళల్లో పదే పదే బాత్రూంకు వెళ్తున్నాడని..

Viral News: ఆఫీసులో ఒకటికి రెండుసార్లు బాత్రూంకు వెళ్తే మాత్రం జాబ్‌లోంచి తీసేయడమేంటంటూ కోర్టుకెళ్లాడో ఉద్యోగి.. తీరా చూస్తే..!
ప్రతీకాత్మక చిత్రం

కొందరు బయటికి చెప్పుకోలేని అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఈ క్రమంలో చివరకు మరిన్ని సమస్యలు కొనితెచ్చుకుని అవస్థలు పడాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తికి కూడా ఇలాంటి అనుభమే ఎదురైంది. ఆఫీసు పని వేళల్లో పదే పదే బాత్రూంకు వెళ్తున్నాడని యాజమాన్యం సీరియస్ అయింది. చివరకు అతడిని జాబ్ నుంచి కూడా తీసేసింది. బాత్రూంకు వెళ్తే మాత్రం జాబ్‌లోంచి తీసేయడమేంటంటూ అతను కోర్టుకు వెళ్లాడు. చివరకు ఏం జరిగిందంటే..

చైనాకు (China) చెందిన వాంగ్ అనే వ్యక్తి 2006లో ఓ ప్రైవేట్ కంపెనీలో (private company) చేరి.. 2013వరకూ కాంట్రాక్ట్ పద్ధతిన పని చేశాడు. అయితే 2014లో ఇతడికి అనుకోని ఆరోగ్య సమస్య (health problem) వచ్చి పడింది. జీర్ణకోశ వ్యాధితో (Gastrointestinal disease) ఇతను ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. అయితే ఆరోగ్యం మెరగవకపోగా.. అనంతరం కాలంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రధానంగా టాయిలెట్‌లోనే 3నుంచి 6గంటల వరకూ గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంట్లో ఉన్నంత వరకూ ఎలాంటి ఇబ్బందీ లేకున్నా.. ఆఫీసులో పని వేళల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాడు.

Crime: పెళ్లికి వెళ్లిన తల్లిదండ్రులు.. అక్క ఒక్కతే ఇంట్లో కనిపించడంతో 19 ఏళ్ల ఈ తమ్ముడి దారుణమిదీ.. ఇంటి యజమాని ఫోన్‌తో..!

మొదట్లో ఏదోలా కవర్ చేస్తూ వచ్చినా రాను రాను కంపెనీ యాజమాన్యానికి (Company Owner) సందేహం వచ్చింది. ఈ క్రమంలో 2015 సెప్టెంబర్ 7నుంచి 17వ తేదీ మధ్యలో రోజూ ఎక్కువ సమయం రెస్ట్ రూం, టాయిలెట్‌లో (toilet) గడపడంతో యాజమాన్యం సీరియస్ అయింది. అదే నెలలో అతడి ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఉద్యోగం నుంచి తీసేసింది. అనారోగ్య సమస్యతో పాటూ ఉద్యోగం లేకపోవడంతో తర్వాత అతను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇటీవ ఎలాగైనా మళ్లీ ఉద్యోగంలో చేరాలనే నిర్ణయించుకున్నాడు.

Viral News: ఈ కుర్రాడి గురించి వినగానే.. పవన్ కల్యాణ్ ‘తమ్ముడు’ సినిమా గుర్తుకు రావడం ఖాయం.. కాకపోతే..!

ఇందుకోసం తన సమస్యను వివరిస్తూ కోర్టును ఆశ్రయించాడు. విచారించిన న్యాయస్థానం (court ) చివరకు కంపెనీ తీసుకున్న నిర్ణయం సరైందని తేల్చింది. వాంగ్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అనారోగ్యం సాకు చూపి ఆఫీసులో పని చేయకపోవడం తప్పు’’.. అంటూ కొందరు, ‘‘టాయిలెట్లో అన్నేసి గంటలు గడిపితే.. ఏ యజమానీ సహించడు’’.. అని మరికొందరు, ‘‘అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుని.. మళ్లీ ఉద్యోగంలో చేరాలని ఆశిస్తున్నాం’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: కొంపదీసి ఆమె భర్త విడాకులు ఇస్తాడా ఏంటి..?.. పెళ్లి వేడుకలో ఈ మహిళ డాన్స్ చూసి నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..!

Updated Date - 2023-06-03T21:14:55+05:30 IST