Crime News: రూ.1000 కోసం స్నేహితుడి హత్య.. 9 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు ఫైనల్‌గా ఇచ్చిన తీర్పు ఏంటంటే..!

ABN , First Publish Date - 2023-06-04T17:39:41+05:30 IST

డబ్బు మనిషితో ఏ పని అయినా చేయిస్తుంది. చివరకు బంధాలు, అనుబంధాలను కూడా తెంచేసి మనిషిలో నిలువెల్లా స్వార్థాన్ని నింపుతుంది. కొందరు డబ్బు కోసం కుటుంబ సభ్యులను చంపడానికి కూడా వెనుకాడరు. ఇలాంటి ఘటనలు నిత్యం మన ముందు జరుగుతూనే ఉంటాయి. తాజాగా..

Crime News: రూ.1000 కోసం స్నేహితుడి హత్య.. 9 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు ఫైనల్‌గా ఇచ్చిన తీర్పు ఏంటంటే..!
ప్రతీకాత్మక చిత్రం

డబ్బు మనిషితో ఏ పని అయినా చేయిస్తుంది. చివరకు బంధాలు, అనుబంధాలను కూడా తెంచేసి మనిషిలో నిలువెల్లా స్వార్థాన్ని నింపుతుంది. కొందరు డబ్బు కోసం కుటుంబ సభ్యులను చంపడానికి కూడా వెనుకాడరు. ఇలాంటి ఘటనలు నిత్యం మన ముందు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముగ్గురు యువకులు రూ.1000 కోసం తమ స్నేహితుడినే హత్య చేశారు. 9 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు ఫైనల్‌గా సంచలన తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్ (Rajasthan) కోట జిల్లా అమృతఖేడి ప్రాంతానికి చెందిన గుల్షన్, సోను, బాబు, కైలాష్ అనే నలుగురు యువకులు స్నేహితులు. అయితే 2014లో గుల్షన్ అనే వ్యక్తికి మిగతా ముగ్గురు స్నేహితులకు రూ.1000ల విషయంలో తరచూ గొడవలు (Disputes over money) జరుగుతుండేవి. అయినా గుల్షన్ ఆ మొత్తాన్ని వారికి తిరిగి ఇవ్వలేదు. దీంతో ఈ గొడవలు కాస్త మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఓ రోజు గుల్షన్ ఇంటి నుంచి పని మీద ఒక్కడే బయటికి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న మిగతా ముగ్గురు స్నేహితులు.. అతడి వెంటే వెళ్లారు.

Viral Video: కొంపదీసి ఆమె భర్త విడాకులు ఇస్తాడా ఏంటి..?.. పెళ్లి వేడుకలో ఈ మహిళ డాన్స్ చూసి నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..!

నిర్మానుష్య ప్రదేశంలో అతడిపై రాళ్లతో మూకుమ్మడిగా (Attacked with stones) దాడి చేశారు. ఈ దాడిలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత మృతదేహాన్ని సుకేత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాట్లీ నదికి సమీపంలో పడేసి వెళ్లారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఇప్పటి వరకూ మొత్తం 27మంది సాక్షులను విచారించారు. 9 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత.. ఇటీవల ముగ్గురు నిందితులకూ జీవిత ఖైదుతో (life imprisonment) పాటూ రూ.20వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ వార్త ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Viral News: వామ్మో.. ఈ యువతి టాలెంట్ మామూలుగా లేదుగా.. ఇన్‌స్టా అకౌంట్‌ను ఓపెన్ చేసి అనుకున్నది సాధించేసింది..!

Updated Date - 2023-06-04T17:39:41+05:30 IST