ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking: ప్రపంచంలోనే అరుదైన సంఘటన.. బ్యాటరీల సాయంతో బతుకుతున్న 30 ఏళ్ల మహిళ.. అదేంటని అవాక్కవుతున్నారా..?

ABN, First Publish Date - 2023-10-27T11:10:01+05:30

ప్రపంచంలో నే అరుదైన సంఘటన ఒకటి అగ్రరాజ్యం అమెరికా (America) లో వెలుగు చూసింది. ఒక అరుదైన హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ కేవలం బ్యాటరీల సాయంతోనే బతుకుతోంది. అవును మీరు విన్నది నిజమే.

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అరుదైన సంఘటన ఒకటి అగ్రరాజ్యం అమెరికా (America) లో వెలుగు చూసింది. ఒక అరుదైన హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ కేవలం బ్యాటరీల సాయంతోనే బతుకుతోంది. అవును మీరు విన్నది నిజమే. మహిళకు ఉన్న గుండె జబ్బు కారణంగా ప్రస్తుతం ఆమెకు పల్స్ కూడా లేదట. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని బోస్టన్‌ (Boston) కి చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ సోఫియా హార్ట్ (Sofia Hart) అనే 30 ఏళ్ల మహిళనే ఇలా అరుదైన గుండె సంబంధిత వ్యాధితో పోరాడుతోంది. ఆమెకు ఉన్న వ్యాధిని వైద్య పరిభాషలో 'డైలేటెడ్ కార్డియోమయోపతి' (Dilated Cardiomyopathy) అంటారు. ఇది ఒక గుండె కండరాల రుగ్మత. దీంతో ప్రస్తుతం సోఫియాకు పల్స్ లేదు.

Shocking: చెవుల్లో పదే పదే ఏదో వెరైటీ శబ్దం.. 4 రోజుల తర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్లిన తర్వాత ఆమెకు మైండ్‌బ్లాక్.. ఆస్పత్రిలో చెప్పింది విని..!

దాంతో ఆమె 'లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైస్‌' (LVAD-Left Ventricular Assist Device) పై ఆధారపడి జీవిస్తోంది. ఈ పరికరం బ్యాటరీల సాయంతో నడుస్తోంది. ఇక ఈ డివైజ్ కారణంగానే ఆమె హృదయ కండరాలలో కదిలిక అనేది ఉంటుంది. ఒకవేళ పరికరం లేకపోతే అంతే సంగతులు. అందుకే తాను బ్యాటరీల సాయంతో బతుకుతున్నట్లు చెబుతోందామె. ప్రస్తుతం సోఫియా హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం ఎదురుచూస్తోంది. సోఫియాకు గుండె మార్పిడి జరిగే వరకు ఎల్‌వీఏడీ (LVAD) అనేది తాత్కాలిక పరిష్కారం అని ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యులు చెబుతున్నారు. కాగా, సోఫియా కవల సోదరి ఒలివియా కూడా ఇదే అరుదైన వ్యాధితో జన్మించింది. కానీ, ఆమె అనారోగ్యానికి గురయ్యే వరకు ఈ హృద్రోగం ఉన్నట్లు బయటపడలేదు. ఇక ఒలివియాకు 2016లో గుండె మార్పిడి జరిగింది. అప్పటి వరకు ఆమె కూడా ఎల్‌వీఏడీ సాయంతోనే బతికింది.

IAS Officer Video: ఐఏఎస్ ఆఫీసర్‌వు అయి ఉండి ఇవేం పనులయ్యా..? ఇది కరెక్టేనా..? అంటూ నెట్టింట పేలుతున్న సెటైర్ల వెనుక..!

Updated Date - 2023-10-27T11:14:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising