Share News

Shocking: చెవుల్లో పదే పదే ఏదో వెరైటీ శబ్దం.. 4 రోజుల తర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్లిన తర్వాత ఆమెకు మైండ్‌బ్లాక్.. ఆస్పత్రిలో చెప్పింది విని..!

ABN , First Publish Date - 2023-10-27T10:23:54+05:30 IST

ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో చెవుల్లోకి ఏ పురుగో దూరితే.. ఆ తర్వాత చుక్కలు కనిపించడం ఖాయం. తెల్లారి లేచేసరికి విపరీతమైన చెవిపోటు తప్పదు. ఎందుకిలా అవుతుందో అంతుపట్టక.. వైద్యుల వద్దకు వెళ్తే గానీ అసలు విషయం బయటపడదు.

Shocking: చెవుల్లో పదే పదే ఏదో వెరైటీ శబ్దం.. 4 రోజుల తర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్లిన తర్వాత ఆమెకు మైండ్‌బ్లాక్.. ఆస్పత్రిలో చెప్పింది విని..!

ఇంటర్నెట్ డెస్క్: ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో చెవుల్లోకి ఏ పురుగో దూరితే.. ఆ తర్వాత చుక్కలు కనిపించడం ఖాయం. తెల్లారి లేచేసరికి విపరీతమైన చెవిపోటు తప్పదు. ఎందుకిలా అవుతుందో అంతుపట్టక.. వైద్యుల వద్దకు వెళ్తే గానీ అసలు విషయం బయటపడదు. తాజాగా తైవాన్‌కు చెందిన 64 ఏళ్ల వృద్దురాలికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. నిద్రలో నుంచి లేచిన ఆమెకి ఎడమ చెవిలో ఏదో వింత శబ్ధం పదే పదే వినిపించడం మొదలైంది. దాంతో ఆ చెవిని పలుమార్లు శుభ్రం చేసింది. అయినా అదే తంతు. అలా నాలుగు రోజులు గడిచిపోయాయి. ఆ వెరైటీ శబ్ధం మాత్రం ఆగలేదు. ఇక లాభం లేదనుకున్న ఆమె.. తైవాన్ సిటీలోని మున్సిపల్ ఆసుపత్రి (Municipal Hospital) కి వెళ్లింది.

Viral Video: ఇదేం వింత బాబోయ్.. ఇవి ఎలుకలా..? జింకలా..? ఈ వీడియోను చూసిన తర్వాత చెప్పగలిగితే మీరు తెలివైన వాళ్లే..!

ఇక వృద్ధురాలిని పరీక్షించిన అక్కడి వైద్యులు.. ఆమె చెవిలో కనిపించిన దృశ్యం చూసి షాకయ్యారు. లోపల ఓ సాలీడు (Spyder) గూడు కట్టుకుని ఉండడం వారికి కనిపించింది. వైద్యులు ఆమె చెవిలో లైట్ వేయగానే లోపలున్న సాలెడు అటుఇటు పాకడం గుర్తించారు. మరోకటి చనిపోయి ఉండటం కనిపించింది. వైద్యులు వాటిని నెమ్మదిగా బయటకు తీశారు. దాంతో మహిళ ఊపిరిపీల్చుకుంది. ఇక ఈ ఘటన తాలూకు వీడియోను నెట్టింట ప్రత్యక్షం కావడంతో అది కాస్తా వైరల్ అవుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో చైనాలో కూడా ఇదే తరహా ఒక కేసు బయటపడింది. ఓ మహిళ చెవిలో పదే పదే నొప్పి రావడం, శబ్దం వినిపించడంతో డాక్టర్ వద్దకు వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యుడు చెవిలో సాలీడు గూడు కట్టుకుని ఉండటాన్ని గుర్తించారు.

IAS Officer Video: ఐఏఎస్ ఆఫీసర్‌వు అయి ఉండి ఇవేం పనులయ్యా..? ఇది కరెక్టేనా..? అంటూ నెట్టింట పేలుతున్న సెటైర్ల వెనుక..!

Updated Date - 2023-10-27T10:24:21+05:30 IST