ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: దీనికి ఎంత ధైర్యం.. మూడు చిరుత పులులు చుట్టుముట్టి దాడి చేస్తున్నా అస్సలు భయపడలేదు.. వాటితో పోరాడి మరీ..!

ABN, First Publish Date - 2023-05-07T12:03:50+05:30

ఒక చిన్న క్షీరద జంతువుపై మూడు క్రూరమైన చిరుతలు (Leopards) దాడి చేస్తే ఏం జరుగుతుంది. క్షణాల్లో వాటికి ఆ చిన్న జంతువు ఆహారం అయిపోతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Honey Badger vs 3 Leopards Fight Video: ఒక చిన్న క్షీరద జంతువుపై మూడు క్రూరమైన చిరుతలు (Leopards) దాడి చేస్తే ఏం జరుగుతుంది. క్షణాల్లో వాటికి ఆ చిన్న జంతువు ఆహారం అయిపోతుంది. కానీ, ఇక్కడ అది జరగలేదు. ఆ చిన్న జంతువు.. మూడు చిరుత పులులు చుట్టుముట్టి దాడి చేస్తున్నా అస్సలు భయపడలేదు. బలీయమైన ఆ మూడు చిరుతలతో ధైర్యంగా పోరాడి మరీ ప్రాణాలు కాపాడుకుంది. ఆ చిన్న క్షీరదమే హనీ బాడ్జర్ (Honey Badger). ఇది చూడ్డానికి చిన్నగా ఉన్నా.. దాని పోరాట స్వభావం, మందపాటి చర్మం కారణంగా ఇతర జంతువులు దీనికి దూరంగా ఉంటాయి. క్రూరమైన జంతువులు కూడా దీనిపై చాలా అరుదుగా దాడి చేస్తాయట. బహుశా ఈ కారణంగానే అది పారిపోవడానికి బదులు ఆ మూడు చిరుత పులులతో పోరాడింది.

ఇంకేముంది.. సులువుగా బాడ్జర్‌ను పట్టేసుకుందాం అనుకున్న చిరుతలతో చుక్కలు కనిపించాయి. చివరకు బాడ్జర్‌ను ఏం చేయలేక తోకముడిచాయి. బాడ్జర్ అక్కడి నుంచి చిరుతలపై విజయగర్వంతో దర్జాగా వెళ్లిపోయింది. ఈ ఫైటింగ్ తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట్ తెగ వైరల్ అవుతోంది. ఈ నెల 4న ఫిగెన్ స్పోర్ట్ (@Figensport) అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేయగా.. ఇప్పటివరకు 10.40లక్షల మంది వీక్షించారు. సుమారు 48వేల లైక్స్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. 'ఈ జంతువు అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించింది' అని ఒకరు, 'బహుశా అందుకే దీన్ని హనీ బాడ్జర్ అని పిలుస్తారని' మరోకరు రాశారు. ఇంకేందుకు ఆలస్యం మీరూ బాడ్జర్ బ్రేవ్ ఫైటింగ్‌పై ఓ లుక్కేయండి.

Software Engineer: 48 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. 8 రోజుల్లోనే రూ.34 లక్షలు మటాష్.. అసలేం జరిగిందని పోలీసులు అడిగితే..!


Updated Date - 2023-05-07T12:03:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising