Software Engineer: 48 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. 8 రోజుల్లోనే రూ.34 లక్షలు మటాష్.. అసలేం జరిగిందని పోలీసులు అడిగితే..!

ABN , First Publish Date - 2023-05-07T10:51:46+05:30 IST

కర్నాటకు చెందిన 48 ఏళ్ల ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (Software Engineer) చేసిన చిన్న పొరపాటు అతడిని నిండా ముంచేసింది. ఎనిమిది రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ. 34 లక్షలు మటాష్ అయ్యాయి.

Software Engineer: 48 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. 8 రోజుల్లోనే రూ.34 లక్షలు మటాష్.. అసలేం జరిగిందని పోలీసులు అడిగితే..!

ఇంటర్నెట్ డెస్క్: కర్నాటకు చెందిన 48 ఏళ్ల ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (Software Engineer) చేసిన చిన్న పొరపాటు అతడిని నిండా ముంచేసింది. ఎనిమిది రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ. 34 లక్షలు మటాష్ అయ్యాయి. కష్టపడి సంపాదించిన డబ్బు ఇలా బురదలో పోసిన పన్నీరుగా మారడంతో లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. అసలు టెకీ చేసిన పొరపాటు ఏంటి? 8 రోజుల వ్యవధిలో ఇంత భారీ మొత్తం ఎలా పొగొట్టుకున్నాడు? తదితర వివరాలు తెలియాలంటే మనం ఈ స్టోరీ చదవాల్సిందే.

మారతహళ్లి సమీపంలోని మున్నెకొల్లాల్‌కు (Munnekollal) చెందిన సల్మాన్ (పేరు మార్చబడింది) ఏప్రిల్ మొదటివారంలో ఓ మ్యాట్రిమోనియల్ సైట్‌లో (Matrimonial Site) తన పేరు నమోదు చేసుకున్నాడు. దాంతో కొన్ని తర్వాత అతడికి ఓ మహిళ కాల్ చేసింది. తన పేరు ఫాతీమా మొహ్మద్‌గా చెప్పుకున్న ఆ మహిళ.. మీ ప్రొఫైల్ చూశాను, నాకు బాగా నచ్చిందని చెప్పింది. ప్రస్తుతం తాను లండన్‌లో ఉంటున్నట్లు చెప్పిన ఆమె.. త్వరలోనే ఇండియాకు వస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఏప్రిల్ 11న సల్మాన్‌కు మనీషా శర్మ అనే మహిళ నుంచి ఫోన్ వచ్చింది. తాను కస్టమ్స్ ఆఫీసర్ అని చెప్పిన మనీషా.. ఫాతీమా ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చిందని, ఆమె వద్ద ఉన్న సుమారు రూ.5కోట్ల విదేశీ కరెన్సీతో పాటు ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారని చెప్పింది. వాటిని విడిపించేందుకు కొంత చార్జీలు చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది.

Auto Driver: ఈ ఆటో డ్రైవర్ డబ్బులు తీసుకోడట.. ఎంత దూరమైనా ఫ్రీగానే తీసుకెళ్తాడట.. కానీ ఒకే ఒక్క కండీషన్ ఏంటంటే..!

దాంతో సల్మాన్ వెనుకముందు ఆలోచించకుండా ఆమె చెప్పిన ఓ బ్యాంక్ ఖాతాకు రూ.34.40లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆ తర్వాత సల్మాన్‌కు డౌట్ రాకుండా ఉండేందుకు పాతీమాతో బాగానే రెస్పాండ్ అయింది. వారం రోజుల తర్వాత ఆమె ఫోన్ స్వీచ్చాఫ్ అయింది. అంతే.. సల్మాన్ ఫీజులు ఎగిరిపోయాయి. అప్పుడు గానీ మనోడికి తాను మోసపోయినట్లు అర్థం కాలేదు. వెంటనే వైట్‌ఫీల్డ్ సీఈఎన్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల వద్ద జరిగిన విషయం మొత్తం చెప్పాడు. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇలా భారీ మొత్తం కోల్పోవడం చూసి పోలీసులు షాక్ అయ్యారు. అనంతరం ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video: సైలెంట్‌గా పాక్కుంటూ వచ్చి.. తలను పైకి లేపి మరీ.. ఈ పిల్లిని కాటేయబోయిన పాము.. మరుక్షణంలోనే జరిగిన సీన్ చూస్తే..!

Updated Date - 2023-05-07T10:51:46+05:30 IST