ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Daughter-in-law: నీకు దండం పెడతా అత్తా.. అని చేతులెత్తి మొక్కినా వినిపించుకోలేదు.. కోడలి జుట్టును కత్తెరతో కట్ చేసేసింది.. చివరకు..!

ABN, First Publish Date - 2023-06-11T09:02:29+05:30

రోజురోజుకూ మహిళలపై దాడులు పెరుగుతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ఎంతో మంది మహిళలు నిత్యం ఇంటా, బయటా అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కొందరు భర్త కారణంగా ఇబ్బంది పడుతుంటే.. మరికొందరు అత్తమామల వేధింపులు భరించలేక అవస్థలు పడుతున్నారు. చాలా మంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోజురోజుకూ మహిళలపై దాడులు పెరుగుతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ఎంతో మంది మహిళలు నిత్యం ఇంటా, బయటా అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కొందరు భర్త కారణంగా ఇబ్బంది పడుతుంటే.. మరికొందరు అత్తమామల వేధింపులు భరించలేక అవస్థలు పడుతున్నారు. చాలా మంది మహిళలు తమ సమస్యలు బయటికి చెప్పుకోలేక నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం పెరగడంతో ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఓ మహిళకు సంబంధించిన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ‘‘నీకు దండం పెడతా అత్తా’’.. అని చేతులెత్తి మొక్కినా అత్త వినిపించుకోకుండా.. కోడలి జుట్టును కత్తెరతో కట్ చేసేసింది. చివరకు ఏం జరిగిందంటే..

రాజస్థాన్ (Rajasthan) సికార్‌లోని లోసాల్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగౌర్‌కు చెందిన ఓ మహిళ (woman) .. లోసాల్ ప్రాంతంలో భర్త, అత్తమామలతో కలిసి ఉంటోంది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో (Viral photos and videos) తెగ వైరల్ అవుతున్నాయి. జూన్ 8న సదరు మహిళపై తన అత్త దాడి (attack) చేసింది. అంతటితో ఆగకుండా మేడపైకి తీసుకెళ్లి.. అందరి సమక్షంలో ఆమె జుట్టును కత్తిరించే ప్రయత్నం చేసింది. దీంతో కోడలు (Daughter-in-law) ఏడుస్తూ.. ‘‘నీకు దండం పెడతా అత్తా.. నన్ను వదిలెయ్’’.. అని చేతులెత్తి మొక్కుతున్నా అత్త మాత్రం వినిపించుకోలేదు. బలవంతంగా ఆమె జుట్టును మొత్తం కట్ చేసేసింది. ఆ సమయంలో చాలా మంది అక్కడే ఉన్నా ఎవరూ విడిపించే ప్రయత్నం చేయలేదు. పైగా కొందరు మహిళలు అత్తకే మద్దతు పలుకుతూ జుట్టు కత్తిరించాలని ప్రోత్సహించారు.

Viral Video: పెట్రోల్ బంక్ వద్దకు వచ్చిందో వింత వాహనం.. నివ్వెరపోయి చూస్తున్న జనం.. పడుకునే మంచాన్నే బైకుగా మార్చేశారుగా..!

ఇంకొందరు ఈ దారుణాన్ని వీడియోలు, ఫొటోలు తీస్తూ ఉండిపోయారు. దీంతో కోడలు మొఖం చూపించలేక, మరోవైపు అవమానాన్ని భరించలేక ఏడుస్తూ ఉండిపోయింది. శుక్రవారం బాధిత మహిళ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురు తప్పు లేకున్నా.. అత్త కావాలనే దాడి చేసిందని ఆరోపించింది. ఇదిలావుండగా, దీనిపై బాధితురాలి అత్త గానీ, కుటుంబ సభ్యులు గానీ పోలీస్ స్టేషన్‌కి రాలేదని తెలిసింది. మరోవైపు పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమకు న్యాయం జరగలేదని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. కోడలిపై దాడి చేసిన అత్తపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Eggs: ఉడికించిన గుడ్లను వాసన చూసి వదిలేసిన పెంపుడు కుక్క.. అనుమానంతో ఆ యజమాని గుడ్లను కట్ చేసి చూస్తే..!

Updated Date - 2023-06-11T09:02:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising