ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటమి భారం.. దానికి తోడు పక్కనున్నవాళ్లు నవ్వారని అవమాన భారం.. భరించలేక అతడు ఎంతకు తెగించాడంటే..

ABN, First Publish Date - 2023-02-24T16:09:05+05:30

కొన్ని సార్లు అదే నవ్వు నాలుగందాల చేటు అని కూడా అంటారు పెద్దలు. ఎక్కడ నవ్వాలో... ఎక్కడ నవ్వకూడదో తెలుసుకుంటే మంచిదని

నవ్వు నాలుగందాల చేటు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నవ్వడం ఒక యోగం. నవ్వించడం ఒక భోగం. నవ్వకపోవడం ఒక రోగం అన్నారు ఓ సినీ కవి.. అంతేకాదు వైద్యులు కూడా నవ్వుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు. అంతేకాదండోయ్.. కొన్ని సార్లు అదే నవ్వు నాలుగందాల చేటు అని కూడా అంటారు పెద్దలు. ఎక్కడ నవ్వాలో... ఎక్కడ నవ్వకూడదో తెలుసుకుంటే మంచిదని తాజాగా బ్రెజిల్‌లో జరిగిన ఉదంతమే ఇందుకు నిదర్శనం.

ఆటను ఆటగా ఆస్వాదిస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కొన్నిసార్లు అది వెర్రితలలు వేస్తోంది. ఆవేశంతో కొంత మంది మారణహోమానికి తెరలేపుతున్నారు. తమ అభిమాన ఆటగాళ్లో.. లేదంటే తమ అభిమాన దేశం ఓడిపోయిందనో కొంత మంది ఆగ్రహావేశాలతో స్టేడియాల్లో నరమేధం సృష్టించిన సంఘటనలు ఎన్నో చూశాం. అనేక మంది ప్రాణాలు పోగొట్టుకోవడం కూడా వార్తల్లో చూశాం. తాజాగా ఆటలో ఓడిపోయిన తనను చూసి నవ్వారని ఏకంగా ఏడుగురిని కాల్చి చంపేశాడు ఓ దుర్మార్గుడు. ఈ దారుణ సంఘటన బ్రెజిల్‌ (Brazil)లో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: ఆర్టీసీ బస్సులో ఓ యువతిపై మూత్ర విసర్జన చేసిన 25 ఏళ్ల యువకుడు.. విమానంలోనే కాదు.. బస్సులోనూ అదే సీన్ రిపీట్..!

సినోప్ నగరానికి చెందిన ఎడ్గర్ రికార్డో డి ఒలివిరా (Edgar Ricardo de Oliveira) తన స్నేహితుడు రెబిరో (Ribeiro)తో కలిసి మంగళవారం పూల్‌ హాల్‌ (pool game)కు వచ్చాడు. అక్కడ ఓ వ్యక్తితో పందెం కాసి ఓడిపోయాడు. మరోసారి పౌరషంతో అదే వ్యక్తితో బెట్టింగ్ (Betting) కట్టి రెండో సారి కూడా ఓటమి పాలయ్యాడు. దీంతో అక్కడే ఉన్న కొంత మంది అతడ్ని చూసి నవ్వుకున్నారు. అంతే ఒక్కసారిగా కోపోద్రిక్తులైన ఒలివిరా, అతని స్నేహితుడు రెబిరో ఆవేశంతో రగిలిపోయారు. వెంటనే కారులో నుంచి రెబిరో గన్ తీసుకొచ్చి అక్కడున్నవారిని వరుసలో నిలబెట్టాడు. అనంతరం ఒలివిరా తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో 12 ఏళ్ల బాలికతో సహా ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఇది కూడా చదవండి: రాజభోగం అంటే ఇతడిదే.. ఇంట్లో ఖాళీగా ఉంటోంటే.. భార్యలే ఉద్యోగాలు చేసి భర్తను పోషిస్తున్నారు..!

Updated Date - 2023-02-24T16:10:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising