రాజభోగం అంటే ఇతడిదే.. ఇంట్లో ఖాళీగా ఉంటోంటే.. భార్యలే ఉద్యోగాలు చేసి భర్తను పోషిస్తున్నారు..!

ABN , First Publish Date - 2023-02-22T15:57:28+05:30 IST

ఆయనకి ఇద్దరు, ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు, ఆవిడా మా ఆవిడే, చిలకొట్టుడు.. ఇవన్నీ ఏంటీ అనుకుంటున్నారా? అయితే ఓ సారి ప్లాష్ బ్లాక్‌కు వెళ్లండి. గుర్తొచ్చాయా?

రాజభోగం అంటే ఇతడిదే.. ఇంట్లో ఖాళీగా ఉంటోంటే.. భార్యలే ఉద్యోగాలు చేసి భర్తను పోషిస్తున్నారు..!
రాజభోగం అంటే ఇతడిదే...

ఆయనకి ఇద్దరు, ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు, ఆవిడా మా ఆవిడే, చిలకొట్టుడు.. ఇవన్నీ ఏంటీ అనుకుంటున్నారా? అయితే ఓ సారి ప్లాష్ బ్లాక్‌కు వెళ్లండి. గుర్తొచ్చాయా? అదేనండి.. టాలీవుడ్‌‌లో బంపర్ హిట్ కొట్టిన సినిమా పేర్లు. ఇప్పుడెందుకు ఇవి గుర్తుచేస్తున్నామనే కదా మీడౌట్. అయితే ఇది చదివాక వామ్మో వీడికి ఇంత సీనుందా? అని అనుకుంటారు.

ఇద్దరు, ముగ్గురు భామలతో హీరోలు రొమాన్స్ చేసిన చిత్రాలెన్నో వచ్చాయి. అలాగే ప్రేక్షకులు కూడా వాటిని హిట్ చేసి ఆదరించారు. ఇదంతా రెండున్నర గంటల పాటు వినోదం కోసం బాగానే ఉంటుంది. అదే నిజ జీవితంలోకి వచ్చేటప్పటికి రీల్‌కి, రియల్‌కి చాలా తేడా ఉంటుంది. అయితే సినిమాల్లో హీరోయిన్లు-హీరో మధ్య తగాదాలు వచ్చిన సందర్భాలున్నాయి. కానీ రియల్‌ లైఫ్‌లో అలాంటివి ఏమీలేకుండా సంసారం చేసి చూపించాడో వ్యక్తి. అతడు సామంతుడు కాదు.. ఉన్నతోద్యోగస్తుడు కాదు. అందగాడు అంతకంటే కాదు. పనీ పాట లేకుండా ఇంట్లో ఖాళీగా కూర్చుని తింటాడు. అలాంటోడికి ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు భార్యలున్నారు. అంతేనా అంటే అంతటితో ఆగకుండా పైగా అతగాడు తనకు తాను రాజుగా అభివర్ణించుకుంటూ ముగ్గురు భామల ముద్దుల మొగుడుగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ మగధీరుడు ఎవడనే కదా? అయితే ఇది చదవండి.

n-3.jpg

అమెరికా (America)కు చెందిన నిక్ డెవిస్ (Nick Davis).. ముగ్గురు భామలను మ్యారేజ్ చేసుకొని దర్జాగా లైఫ్‌ (life) ను ఆస్వాదిస్తున్నాడు. అంతేకాదండోయ్.. ఆ ముగ్గురే ఉద్యోగాలు చేస్తూ నిక్‌ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. అందుకే అతగాడేమంటాడంటే.. తాను చెస్ (Chess) ఆటలో రాజులాంటోడ్ని.. రాజు (King) ఎక్కడైనా కష్టపడతాడా? అంటూ ప్రశ్నిస్తాడు. ముగ్గుర్నీ ఉద్యోగాలకు పంపి.. హాయిగా సుఖం అనుభవిస్తున్నాడు. 15 ఏళ్ల క్రితం మొదటి భార్యను ఏప్రిల్(38)ను వివాహం చేసుకున్నాడు. అనంతరం తొమ్మిదేళ్లకు భార్య అనుమతితోనే జెన్నీఫర్(34) అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇలా ఇద్దరితో సంసారం చేస్తుండగానే వారిద్దరి సమ్మతితో డానియేల్ (22) అనే మరో యంగ్ లేడీని మనువాడాడు. ఇలా ముగ్గురు భార్యలతో ఒకే ఇంట్లో కాపురం చేస్తూ ఎలాంటి గొడవులూ లేకుండా కాపురం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తన కల నిజమైందని నిక్ మురిసిపోతున్నాడు. ప్రస్తుతం ఇతగాడికి ఇద్దరు పిల్లలున్నారు. ముగ్గురు భార్యలు కూడా నిక్‌తో కలిసి ఉండడం చాలా ఇష్టంగా ఉందని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్తపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఒకే ఇంట్లో ముగ్గురు భార్యలతో కలిసి ఉండడాన్ని చూసి విస్తుపోతున్నారు.

ఇది కూడా చదవండి: Viral Video: బైక్‌పై ఈ కోతులు ఎంత బుద్ధిగా కూర్చున్నాయో.. డ్రైవింగ్ చేసిన కుర్రాడి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..!

Updated Date - 2023-02-22T18:09:12+05:30 IST