Viral Video: బైక్‌పై ఈ కోతులు ఎంత బుద్ధిగా కూర్చున్నాయో.. డ్రైవింగ్ చేసిన కుర్రాడి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..!

ABN , First Publish Date - 2023-02-17T17:46:43+05:30 IST

రీసెంట్‌గా అప్‌లోడ్ అయిన ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.

Viral Video: బైక్‌పై ఈ కోతులు ఎంత బుద్ధిగా కూర్చున్నాయో.. డ్రైవింగ్ చేసిన కుర్రాడి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..!
ఆస్వాదించండి

కొన్ని సందర్భాల్లో జంతువులు (Animals) చేసే విన్యాసాలు భలే ముచ్చటేస్తుంటాయి. సర్కస్‌(Circus)ల్లో అయితే ఎలా ఆడమంటే అలా ఆడుతుంటాయి. అలాగే ఇంట్లో పెంచుకునే జంతువులు అప్పుడప్పుడు పలు హావభావాలు ప్రదర్శిస్తుంటాయి. అవి కూడా మనుషులు చేసినట్లుగానే చేస్తుంటాయి. అంటే మనుషులకు ఉన్నట్లే వాటికి కూడా హావ భావాలు, భావోద్వేగాలు ఉంటాయని అర్ధమవుతుంది. అంతేకాదు అవి కూడా చాలా సార్లు మనుషుల కదలికలు, స్వభావాలను కనిపెడుతుంటాయి. ప్రస్తుతం అలాంటి తరహాకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియా (Social media)లో వైరల్‌ (viral)గా మారింది.

ఓ కుర్రాడు బైక్ (Bike) నడుపుతుండగా అతని వెనుక భాగంలో ఐదు కోతులు బుద్ధిమంతుల్లా కూర్చుని ప్రయాణం చేయడం భలే ముచ్చటేస్తోంది. అచ్చం మనుషులు కూర్చున్నట్టుగానే కదలకుండా కూర్చోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రీసెంట్‌గా అప్‌లోడ్ అయిన ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో రీసెంట్ ట్రెండింగ్‌ (Recent Trending)లో నిలిచింది.

కుర్రాడు పొలంలో బైక్‌పై వెళ్తుండగా ఐదు కోతులు కదలకుండా కూర్చున్నాయి. పైగా ఒకదానికొకటి అంటుపట్టుకుని ప్రయాణం చేశాయి. అంతే కాదు ఎలాంటి భయాందోళన లేకుండా బ్యాలెన్స్‌డ్‌గా కూర్చొని ఉండడం అందర్నీ ఆశ్చర్యకితుల్ని చేసింది. అయితే డ్రైవ్ (Drive) చేస్తున్న వ్యక్తితో ఆ కోతులకు ఎలాంటి రిలేషన్ (relation) ఉందో ఈ వీడియోను చూస్తుంటే అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోను తారానా హుస్సేన్ అనే వ్యక్తి.. ట్విట్టర్‌ (Twitter)లో షేర్ చేయగా.. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ వీడియోను ఆస్వాదిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ప్రయాణీకులకు షాకింగ్ అనుభవం.. విమానం ఎక్కి.. 8 గంటలు ప్రయాణించి.. ఎక్కిన చోటుకే మళ్లీ చేరారు..!

Updated Date - 2023-02-17T17:52:56+05:30 IST