ప్రయాణీకులకు షాకింగ్ అనుభవం.. విమానం ఎక్కి.. 8 గంటలు ప్రయాణించి.. ఎక్కిన చోటుకే మళ్లీ చేరారు..!

ABN , First Publish Date - 2023-02-17T16:49:48+05:30 IST

టైమ్‌కి ప్లైట్ ఎక్కి.. గమ్యస్థానం చేరాక... కొద్ది క్షణాల్లో ల్యాండింగ్ అయిపోతామన్న సమయంలో ఊహించని పరిణామం ఎదురైతే ఎలా ఉంటుంది. అలాంటి సంఘటనే

ప్రయాణీకులకు షాకింగ్ అనుభవం.. విమానం ఎక్కి.. 8 గంటలు ప్రయాణించి.. ఎక్కిన చోటుకే మళ్లీ చేరారు..!
భలే వింత అనుభవం

ఏదైనా దూర ప్రయాణం చేయాలంటే ముందుగానే సంసిద్ధం కావడం సహజమే. అలాగే ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటాం. అది రైలు ప్రయాణమైనా, విమాన ప్రయాణమైనా, చివరికి బస్సు ప్రయాణమైనా ముందుగానే రిజర్వేషన్ చేయించుకుంటాం. ఇక రైలు, ఫ్లైట్ ప్రయాణమంటే చెప్పక్కర్లేదు. మూడు, నాలుగు నెలల ముందే రిజర్వేషన్ చేయించుకుంటేనే తప్ప టికెట్లు దొరకవు. అంత రష్ ఉంటుంది. అందుకే దూర ప్రయాణం చేసేవారంతా ముందే రిజర్వేషన్ చేయించుకుంటారు. ఇక విమాన ప్రయాణమంటే ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ముందు చేసుకుంటేనే తప్ప టికెట్లు దొరకవు. ఇక ఆకాశంలో ఎగరాలి.. అద్దాల్లోంచి ప్రకృతి ఆస్వాదించాలి. గమ్యం చేరుకోవాలి. ఇలా ఎన్నెన్నో కోరికలు ఉంటాయి. తీరా అనుకున్న టైమ్‌కి ప్లైట్ ఎక్కి.. గమ్యస్థానం చేరాక... కొద్ది క్షణాల్లో ల్యాండింగ్ అయిపోతామన్న సమయంలో ఊహించని పరిణామం ఎదురైతే ఎలా ఉంటుంది. అలాంటి సంఘటనే న్యూయార్క్‌ (New York)లో చోటుచేసుకుంది.

ఫ్లైట్‌ (Flight)లో ఎలాంటి సమస్యలు లేవు. చెకింగ్‌లు.. వగేరా అన్ని పూర్తి చేసుకున్నాక విమానం టేకాఫ్ అయింది. దాదాపు 8 గంటలు ప్రయాణం చేసి ల్యాండింగ్ అవుతున్న సమయంలో వచ్చిన సమాచారంతో తిరిగి అదే విమానంలో వెనక్కి వెళ్లిపోవాలంటే ఎట్లుంటుందో ఊహించుకోండి. అలాంటి వింత అనుభవమే న్యూజిలాండ్-అమెరికా ప్రయాణికుల (Air New Zealand Flight)కు ఎదురైంది.

ఇది కూడా చదవండి: Car Smoke: కారులోంచి వచ్చే పొగ నీలి రంగులోకి మారితే అర్థమేంటి..? తెలుపు, నలుపు రంగుల్లో కనిపిస్తే..

ఎయిర్ న్యూజిలాండ్‌కు చెందిన ఓ విమానం గురువారం సాయంత్రం ఆక్లాండ్ (Auckland) నుంచి న్యూయార్క్‌కు బయల్దేరింది. దాదాపు 8 గంటలు ప్రయాణం పూర్తి చేసుకుంది. న్యూయార్‌లో విమానం దిగాల్సిన సమయానికి ఎయిర్‌పోర్టులో విద్యుత్ ప్రమాదం సంభవించింది. ఫ్లైట్ ల్యాండ్ అయ్యేందుకు అనుమతి దొరకలేదు. అమెరికా (America)లో ఏ ఎయిర్‌పోర్టులోనూ పర్మిషన్ లభించలేదు. దీంతో ఫైలెట్ చేసేదేమీ లేక ఎక్కడ్నుంచి బయల్దేరి వచ్చిందో అక్కడికే తీసుకెళ్లి వదిలి పెట్టేశాడు. మరో 8 గంటలు తిరిగి ప్రయాణం చేసి ఆక్లాండ్‌లోనే ల్యాండింగ్ చేశాడు. ఇలా దాదాపు 16 గంటలు గాల్లోనే విమానం విహరించింది. ఈ విషయాన్ని ప్రయాణికులకు ముందే విమాన సిబ్బంది తెలియజేయడంతో ఎలాంటి ఆందోళనలు చేయకుండానే ఇంటి బాట పట్టారు.

ఈ విమానం ఒక్కటే కాదు దీనితో పాటు పలు ఫ్లైట్లకు కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. సియోల్, రోమ్, మిలాన్ నుంచి వచ్చిన కొన్ని విమానాలు సైతం ఇలాగే తిరుగు ప్రయాణమై వెళ్లిపోయాయి. మరికొన్ని విమానాలకు మాత్రం అమెరికాలోని పలు విమానాశ్రాయాల్లో ల్యాండింగ్ చేసేందుకు అనుమతిచ్చాయి. ఇదిలా ఉంటే న్యూజిలాండ్ విమాన ఘటనలో ఎదురైన అనుభవాలను పలు ప్రయాణికులు సోషల్ మీడియా వేదిక సెటైర్లు కురిపించడం విశేషం. నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదని ఓ ప్రయాణికురాలు వ్యాఖ్యానించింది. మరి కొందరు తమదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

ఇది కూడా చదవండి: సగం కాలిన శవాన్ని ఇసుకలో పూడ్చి పెట్టారు.. నెల తర్వాత పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు.. అసలు కథేంటంటే..ఏదైనా దూర ప్రయాణం చేయాలంటే ముందుగానే సంసిద్ధం కావడం సహజమే

Updated Date - 2023-02-17T16:54:39+05:30 IST