Car Smoke: కారులోంచి వచ్చే పొగ నీలి రంగులోకి మారితే అర్థమేంటి..? తెలుపు, నలుపు రంగుల్లో కనిపిస్తే..

ABN , First Publish Date - 2023-02-04T14:26:19+05:30 IST

మన ఆరోగ్యం ఎంతో ముఖ్యమో.. మన వాహనాల హెల్త్ కండీషన్ కూడా అంతే ముఖ్యం. మనం వాడే వాహనాలు కండీషన్‌గా ఉన్నాయో లేవో కూడా కనిపెట్టేయొచ్చు? అదెలా అంటారా? మీరు మెకానిక్‌ దగ్గరకు వెళ్లకుండా.. మీ డబ్బులు ఖర్చు కాకుండా తెలుసుకొనే సూత్రం ఇదే. అదెలాగో ఈ సింపుల్ లాజిక్ తెలిస్తే చాలు!

Car Smoke: కారులోంచి వచ్చే పొగ నీలి రంగులోకి మారితే అర్థమేంటి..? తెలుపు, నలుపు రంగుల్లో కనిపిస్తే..
పొగ నీలి రంగులోకి మారితే అర్థమేంటి..?

ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. అవును ఇది ముమ్మాటికీ నిజం. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం. అలాగే మనకొచ్చే రోగాలను బట్టి కూడా మనం ఆరోగ్యంగా ఉన్నామో లేదో కూడా చెప్పేయొచ్చు. సరే ఇదంతా ఒకే. ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. మన ఆరోగ్యం ఎంతో ముఖ్యమో.. మన వాహనాల హెల్త్ కండీషన్ కూడా అంతే ముఖ్యం. మనం వాడే వాహనాలు కండీషన్‌గా ఉన్నాయో లేవో కూడా కనిపెట్టేయొచ్చు? అదెలా అంటారా? మీరు మెకానిక్‌ దగ్గరకు వెళ్లకుండా.. మీ డబ్బులు ఖర్చు కాకుండా తెలుసుకొనే సూత్రం ఇదే. అదెలాగో ఈ సింపుల్ లాజిక్ తెలిస్తే చాలు!

మనకు రెండు రకాలైన ఇంధనాలతో నడిచే వాహనాలు మనకు తెలుసు. ఒకటి పెట్రోల్‌ (Petrol)తో నడిచేవి.. రెండోది డీజిల్‌ (Diesel)తో నడిచేవి. ఇప్పుడు ఎలక్ట్రికల్ వాహనాలు (Electrical vehicles) కూడా వచ్చాయి. పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాల నుంచి ఇంధనం వినియోగం వల్ల పొగ (Car Smoke) వెలువడుతుంది. ఈ పొగను బట్టే మన వైహికల్ కండిషన్‌ (Vehicle condition)లో ఉందో లేదో చెప్పేయొచ్చు. పొగ సాధారణంగా వెలువడే రీతిలో కాకుండా వేరే రంగుల్లో వెలువడితే మాత్రం మన కారు (Car) లేదా మన బైక్‌ (Bike) సమస్యకు గురైందని నిర్ధారించొచ్చు. ప్రధానంగా ఇవి మూడు రకాలు: ఒకటి నలుపు (black). రెండోది తెలుపు (white). మూడోది నీలం (blue). ఈ మూడు కలర్‌లో పొగ విడుదలవుతుంది.

1. నల్లటి పొగ

కారు నుంచి నల్లటి పొగ విడుదలవుతుంటే సమస్యలో ఉందని అర్థం చేసుకోవచ్చు. ఫ్యూయెల్ ఇంజెక్టర్ (Fuel injector) దెబ్బతినడం వల్లే ఈ రకమైన పొగ విడుదలవుతుంది. మితిమీరిన వినియోగంతోనే ఈ ఇంజెక్టర్ చెడిపోతుంది. అంతే కాకుండా పార్టిక్యులేట్ ఫిల్టర్‌ సమస్యతో కూడా ఈ రకమైన పొగ వెలువడుతుంది. ఇక గాలి (Air)-ఇంధన నిష్పత్తిలో తేడా ఉన్నప్పుడు కూడా ఈ రకమైన పొగ విడుదలవుతుంది. కనుక వెంటనే సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాలి.

3.jpg

2. నీలి రంగు

అలాగే డీజిల్, పెట్రోల్ వాడే కార్ల నుంచి నీలి రంగు పొగ విడుదలవుతుంటే ఇంజిన్ సిస్టమ్‌లో సమస్య వచ్చిందని అర్ధం చేసుకోవచ్చు. పిస్టన్ లేదా వాల్వ్ గైడ్ సీల్ దెబ్బతిందని అర్థం. వీలైనంత త్వరగా మెకానిక్‌కు చూపించి వాహనాన్ని సరిచేయించుకోవడం మంచిది.

car-2.jpg

3. తెల్లటి పొగ

ఇక దట్టమైన తెల్లటి పొగ వెలువడితే అది ప్రమాదకరం. దీనిపై వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. తెల్లటి పొగ నిరంతరం వెలువడుతుంటే సమస్య ఉందని వెంటనే నిర్ధారించాలి. ఇంజిన్ ఆయిల్ సమస్యతోనే ఈ తెల్లటి పొగ వస్తుంది. అలాగే రేడియేటర్ లీక్ (Radiator) అవ్వడం ప్రారంభించినప్పుడు కూడా ఈ రకమైన పొగ వస్తుంది. ఈ మూడు రకాలైన కలర్‌లతో పొగ వస్తే వెంటనే అప్రమత్తం అయి సర్వీస్ సెంటర్‌కు తీసికెళ్లి పరిష్కరించుకోవాలి. లేదంటే వాహనం చెడిపోతుంది.

ఇది కూడా చదవండి: సగం కాలిన శవాన్ని ఇసుకలో పూడ్చి పెట్టారు.. నెల తర్వాత పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు.. అసలు కథేంటంటే..

Updated Date - 2023-02-04T14:26:21+05:30 IST